రాజమౌళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నబాలివుడ్ ఆఫర్లు!
బాహుబలి సినిమా ఒక్కసారిగా రాజమౌళిని భారతీయ సిల్వర్ స్క్రీన్‌మీద మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మార్చేసింది. బాహుబలి తరువాత తనకు బాలివుడ్ నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ బాహుబలి 2 పూర్తి చేసే వరకు వాటి గురించి ఆలోచించే అవకాశం లేదని రాజమౌళి అన్నారు. కరణ్ జోహార్ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. ఏదైమేనా తనకు బాలివుడ్ సినిమాకు దర్శకత్వం చేయాలనే ఆసక్తి […]
బాహుబలి సినిమా ఒక్కసారిగా రాజమౌళిని భారతీయ సిల్వర్ స్క్రీన్‌మీద మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మార్చేసింది. బాహుబలి తరువాత తనకు బాలివుడ్ నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయని, కానీ బాహుబలి 2 పూర్తి చేసే వరకు వాటి గురించి ఆలోచించే అవకాశం లేదని రాజమౌళి అన్నారు. కరణ్ జోహార్ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. ఏదైమేనా తనకు బాలివుడ్ సినిమాకు దర్శకత్వం చేయాలనే ఆసక్తి చాలా ఉందన్నారు.
బాహుబలి2 మొదటిదాని సీక్వెల్ కాదని, దాని కొనసాగింపు కథ ఇందులో ఉంటుందని ఆయన అన్నారు. బాహుబలి కథ చాలా విస్తృతంగా ఉందని, అది కొనసాగుతుందని, మూడవ భాగం కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి2 రెండు షెడ్యూళ్లు పూర్తి అయ్యాయని, మూడవ షెడ్యూలు పూర్తి చేయాల్సి ఉందని ఆయన వివరించారు. తాను ఒక భారీ చిత్రాన్ని తీయాలనే ఆశయంతోనే బాహుబలిని తీసినా ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారని అనుకోలేదన్నారు. మనమొక భారీ లక్ష్యాన్ని ఊహిస్తే కానీ దాన్ని చేరుకోలేమని, బాహుబలి భారీ విజయం సొంతం చేసుకుంటుందని తాము ముందే ఊహించామన్నారు. అయితే అది నిదానంగా ప్రేక్షకులకు ఎక్కుతుందని, ఇతర ప్రాంతాలకు వెళుతుందని తాము అనుకుంటే ఒక్కసారిగా బాంబ్ పేలినట్టుగా అత్యంత వేగంగా విస్తరించిందని అన్నారు.
బాహుబలి2 విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడీ లేదన్నారు. మంచయినా, చెడయినా జరిగిపోయినదంతా గతమని, ఆ ప్రభావం ఇప్పటిపనిపై ఉండదన్నారు. ఆ పొగడ్తలను మనసులోకి తీసుకోనన్నారు. అయితే బాహుబలి2పై విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలుసునని, దాన్ని మాత్రం గుర్తు పెట్టుకుంటానని రాజమౌళి అన్నారు.