జికా వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టిన హైదరాబాద్ సైంటిస్టులు!
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జికా వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో ఉండగా హైదరాబాద్‌కి చెందిన ఒక బయోటెక్ కంపెనీ దాన్ని సాధించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే కంపెనీ తాము జికా వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టి, పేటేంట్ కోసం అప్లయి చేశామని ప్రకటించింది. ఇప్పటికే 20కి పైగా లాటిన్ అమెరికా దేశాల్లో జికా విజృంభిస్తున్న నేపథ్యంలో, గర్భంలో ఉండగానే ఇది పిల్లలపై ప్రభావం చూపుతుందని తేలడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర చర్యలకై పిలుపునిచ్చిన సంగతి […]
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జికా వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో ఉండగా హైదరాబాద్‌కి చెందిన ఒక బయోటెక్ కంపెనీ దాన్ని సాధించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే కంపెనీ తాము జికా వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టి, పేటేంట్ కోసం అప్లయి చేశామని ప్రకటించింది. ఇప్పటికే 20కి పైగా లాటిన్ అమెరికా దేశాల్లో జికా విజృంభిస్తున్న నేపథ్యంలో, గర్భంలో ఉండగానే ఇది పిల్లలపై ప్రభావం చూపుతుందని తేలడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర చర్యలకై పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు జికా వైరస్‌కి వ్యాక్సిన్‌ని కనిపెట్టే పనిలో ఉన్నాయి. వాటి ప్రయత్నాలు తొలిదశల్లో ఉండగానే హైదరాబాద్ కంపెనీ తాము ఇందులో విజయం సాధించామని ప్రకటించింది.
కాండిడేట్ వ్యాక్సిన్ (పరీక్షలకు నిలిచిన వ్యాక్సిన్) పేటెంట్ కోసం తొమ్మదినెలల క్రితమే అప్లయి చేశామని, ఇలా దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో తమదే మొదటిది కావచ్చని భారత్ బయోటెక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కృష్ణా ఎల్లా అన్నారు. అధికారికంగా జీవించిన ఉన్న జికా వైరస్‌ని విదేశాల నుండి దిగుమతి చేసుకుని దానిపై పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ని రూపొందించామని, నిజానికి రెండు రకాల కాండిడేట్ వ్యాక్సిన్లను తయారుచేశామని ఆయన అన్నారు. అయితే వ్యాక్సిన్‌ని జంతువుల మీద, మనుషుల మీద ప్రయోగించాల్సిన క్రమంలో ఇది బయటకు రావడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి తమకు అవసరమైన సహాయం అందించాల్సిందిగా కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నేరుగా కల్పించుకుని త్వరితగతిన ఈ ప్రక్రియ ముందుకు వెళ్లేలా చూడాలని ఆయన కోరారు. కంపెనీకి నాలుగు నెలల్లో పది లక్షల డోసులు వ్యాక్సిన్ తయారుచేయగల సామర్ద్యం ఉందని కృష్ణా ఎల్లా చెప్పారు.
జికా వైరస్‌కి కాండిడేట్ వ్యాక్సిన్, భారత్ బయోటెక్ కంపెనీ వద్ద ఉందని తమకు ఇప్పడే తెలిసిందని, దాన్ని శాస్త్రీయంగా పరిశోధించి, ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో పరిశీలించాల్సి ఉందని పిల్లల వైద్యనిపుణులు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి డైరక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ఇది మేకిన్ ఇండియా ఉత్పత్తులకు ఊతం ఇచ్చేలా ఉందని ఆయన అభినందించారు.