Telugu Global
NEWS

కేసులు స‌రే... ఆ ముగ్గురిని అరెస్ట్ చేయించ‌గ‌ల‌రా?

కాపుల అంశంలో ప్రభుత్వ పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి వెనక్కు వస్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది. తునిలో కొందరు ఆందోళనకారులు రైలుతో పాటు వాహనాలు, పోలీస్ స్టేషన్‌ను త‌గ‌ల‌బెట్టారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ముందుగా కాపు నేత‌ల‌ను టార్గెట్ చేసింది. స‌భ‌కు హాజ‌రైన 27 మంది హేమాహేమీ కాపు నేత‌ల‌పై కేసులు పెట్టింది. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి వారిని అరెస్ట్ చేసే ధైర్యం ప్ర‌భుత్వం ప్రదర్శిస్తుందా అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. కాపు నేత‌లు క‌నీసం ముంద‌స్తు బెయిల్ తెచ్చుకుంటే […]

కేసులు స‌రే... ఆ ముగ్గురిని అరెస్ట్ చేయించ‌గ‌ల‌రా?
X

కాపుల అంశంలో ప్రభుత్వ పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి వెనక్కు వస్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది. తునిలో కొందరు ఆందోళనకారులు రైలుతో పాటు వాహనాలు, పోలీస్ స్టేషన్‌ను త‌గ‌ల‌బెట్టారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ముందుగా కాపు నేత‌ల‌ను టార్గెట్ చేసింది. స‌భ‌కు హాజ‌రైన 27 మంది హేమాహేమీ కాపు నేత‌ల‌పై కేసులు పెట్టింది. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి వారిని అరెస్ట్ చేసే ధైర్యం ప్ర‌భుత్వం ప్రదర్శిస్తుందా అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌.

కాపు నేత‌లు క‌నీసం ముంద‌స్తు బెయిల్ తెచ్చుకుంటే ప్ర‌భుత్వానికి అరెస్ట్ చేయాల్సిన రిస్క్ త‌ప్పేది. కానీ కాపు నేత ముద్ర‌గ‌డ తామెవ్వ‌రం ముందస్తు బెయిల్ తీసుకోబోమ‌ని ప్ర‌క‌టించారు. అరెస్ట్ చేస్తే జైలుకెళ్లేందుకు సిద్ధ‌మంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేసుల్లో వారిని ప్ర‌భుత్వం అరెస్ట్ చేసి కాపుల‌తో మ‌రింత ఘ‌ర్ష‌ణ పెట్టుకుంటుందా అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. 27 మందిలో బొత్స‌, అంబ‌టి, జ్యోతుల నెహ్రు, జ‌క్కంపూడి విజ‌య‌ ల‌క్ష్మి , వైపీసీ ఎమ్మెల్యేలు సుబ్బరావు, దాడిశెట్టి రాజా త‌దిత‌రులున్నారు. వైసీపీ వాళ్లు కాబ‌ట్టి వాళ్ల‌ను అరెస్ట్ చేయ‌డం బాబు ప్ర‌భుత్వానికి పెద్ద‌సంగ‌తేం కాదు. కానీ…

27 మందిలో బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ కూడా ఉన్నారు. వీరిద్ద‌రిని అరెస్ట్ చేయించ‌డంలోనే బాబు స్టామినా బయటపడుతుంది.. ఎందుకంటే ఒక కీల‌క‌మైన బీజేపీ నేత‌ను అరెస్ట్ చేస్తే క‌మ‌లం పార్టీ అగ్ర‌నాయ‌కత్వం త‌ప్ప‌కుండా సీరియ‌స్‌గా స్పందిస్తుంది. ఇక వీహెచ్… సోనియా కుటుంబానికి న‌మ్మిన బంటు. పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు. సో క‌న్నా, వీహెచ్‌ల‌ను అరెస్ట్ చేయిస్తే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ల‌తో పెట్టుకున్న‌ట్టే. అంతేకాదు ..

లిస్ట్‌లో మాజీ కేంద్ర‌మంత్రి ప‌ల్లంరాజు కూడా ఉన్నారు. ఆయ‌న్ను అరెస్ట్ చేస్తే అది జాతీయ స్థాయిలో ఫోక‌స్ అవుతుంది. అప్పుడు చంద్ర‌బాబు పాల‌న‌లో సాగుతున్న తంతుకు జాతీయ స్థాయిలో ప్ర‌చారం వ‌స్తుంది. అప్పుడు ప‌రువు పోయేది ప్ర‌భుత్వానిదే. పైగా 27 మంది కాపు నేత‌ల‌ను అరెస్ట్ చేస్తే ఇక స‌మీప భ‌విష్య‌త్తులో కాపులు టీడీపీకి ఓటే వేస్తార‌నుకోవ‌డం అత్యాశే అవుతుంది.

Click on Image to Read:

pulivendula-babu

kapu-community

venkaiah-naidu

kotla- surya prakash reddy tdp

tdp-women-leader

lokesh-greater-poll

chandrababu-tung-slip

First Published:  3 Feb 2016 4:51 PM IST
Next Story