వెంకయ్య వెయిట్ ఇంతేనా!
రాజకీయనాయకుల ఆస్తుల వివరాలు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. కోటీశ్వరులు అనుకున్న నేతలు సైతం ఆస్తుల వివరాల్లో మాత్రం బీదలుగానే తేలుతున్నారు. సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నా, కేంద్రమంత్రులుగా ఉన్నా కనీసం కారు కూడా కొనుక్కోలేకపోయారట. తాజాగా కేంద్ర మంత్రుల 2014-15 ఆర్థిక ఏడాది చివరి నాటికి ఆస్తుల వివరాలను పీఎంఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 2016 జనవరి 30 వీటిని అప్‌డేట్ చేశారు. వివరాలు ప్రకారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు కారు లేదు. అంతే కాదు ఆయనకు చర, స్థిరాస్తులు లేవు. […]
రాజకీయనాయకుల ఆస్తుల వివరాలు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. కోటీశ్వరులు అనుకున్న నేతలు సైతం ఆస్తుల వివరాల్లో మాత్రం బీదలుగానే తేలుతున్నారు. సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నా, కేంద్రమంత్రులుగా ఉన్నా కనీసం కారు కూడా కొనుక్కోలేకపోయారట. తాజాగా కేంద్ర మంత్రుల 2014-15 ఆర్థిక ఏడాది చివరి నాటికి ఆస్తుల వివరాలను పీఎంఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
2016 జనవరి 30 వీటిని అప్‌డేట్ చేశారు. వివరాలు ప్రకారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు కారు లేదు. అంతే కాదు ఆయనకు చర, స్థిరాస్తులు లేవు. కేవలం 38 వేల రూపాయల నగదు మాత్రమే చేతుల్లో ఉంది. రూ. 28. 7 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. భార్య పేరుతో రూ. 8 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. భార్యకు రూ. 26 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు వెంకయ్య తన ఆస్తుల చిట్టాలో వివరించారు. మరో కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్‌కు పాపం కారు కూడా లేదు. ఆభరణాలు, డిపాజిట్ల విలువ కలిపితే రూ. 5. 35 కోట్లు ఉన్నాయి. సుస్మా దగ్గర 22 వేల 616 రూపాయల మొత్తం ఉంది.
కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సేవింగ్ ఖాతాలో రూ. 5. 06 కోట్లు ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ రూ. 1. 51 కోట్లు ఉంది. సాగు భూమి 62 సెంట్లు, వాణిజ్యభూమి 1.20 సెంట్లు మాత్రమే ఉంది. ఇంటి విలువ 25 లక్షలుగా చూపారు.
Click on Image to Read: