Telugu Global
Cinema & Entertainment

సింగం మారథాన్ రెడీ

ఇప్పటివరకు నిదానంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన సింగం-3 సినిమా ఫిబ్రవరి 5 నుంచి పరుగులు పెట్టనుంది. ఒకేసారి భారీ షెడ్యూల్ కు ఓకే చెప్పాడు సూర్య. ఫిబ్రవరి 5 నుంచి ఏకంగా ఈనెలంతా సింగం-3 సినిమాను ఏకథాటిగా పూర్తిచేయాలని  ఫిక్స్ అయ్యాడు. ఈ షెడ్యూల్ కు మలేషియా వేదికకానుంది. ఆ దేశంలోని అందమైన లొకేషన్లలో సినిమాకు సంబంధించిన కీలకమైన ఫైట్లు, రెండు పాటలు పిక్చరైజ్ చేయాలని దర్శకుడు హరి నిర్ణయించాడు. వీలైనంత తొందరగా సినిమా పూర్తిచేయాలనే ఆలోచనలో […]

సింగం మారథాన్ రెడీ
X

ఇప్పటివరకు నిదానంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన సింగం-3 సినిమా ఫిబ్రవరి 5 నుంచి పరుగులు పెట్టనుంది. ఒకేసారి భారీ షెడ్యూల్ కు ఓకే చెప్పాడు సూర్య. ఫిబ్రవరి 5 నుంచి ఏకంగా ఈనెలంతా సింగం-3 సినిమాను ఏకథాటిగా పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ షెడ్యూల్ కు మలేషియా వేదికకానుంది. ఆ దేశంలోని అందమైన లొకేషన్లలో సినిమాకు సంబంధించిన కీలకమైన ఫైట్లు, రెండు పాటలు పిక్చరైజ్ చేయాలని దర్శకుడు హరి నిర్ణయించాడు. వీలైనంత తొందరగా సినిమా పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్న సూర్య కూడా… ఈ భారీ షెడ్యూల్ కు ఓకే చెప్పాడు. సింగం తొలి రెండు భాగాలు సూపర్ హిట్టవ్వడంతో… సింగం-3పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే… అద్భుతమైన సీక్వెల్ కథను హరి సిద్ధంచేశాడని తెలుస్తోంది. సింగం-3లో సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో సూర్య… తన మీసకట్టును కొద్దిగా మార్చాడని సమాచారం.

First Published:  3 Feb 2016 4:50 AM IST
Next Story