రజనీ కథలో రజనీనే హీరోనా ?
కర్ణాటక లో బసు కండక్టర్ గా జీవితం ప్రారంభించిన ఒక సాధారణ యువకుడు.. ఈ రోజు అంతర్జాతీయంగా పాపులర్ అయ్యాడు. జపాన్, మలేసియా , సింగపూర్ వంటి దేశాల్లో కూడా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న మొనగాడు. 40 ఏళ్ల కు పైగ నట ప్రయాణం. ఇప్పుడు ఆయన వయసు 65 ఏళ్లు. ఆయన చేస్తున్న రెండు చిత్రాల బడ్జెట్ 6 వందల కోట్లు వరకు ఉందంటే.. ఆయన కమర్షియల్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. […]
కర్ణాటక లో బసు కండక్టర్ గా జీవితం ప్రారంభించిన ఒక సాధారణ యువకుడు.. ఈ రోజు అంతర్జాతీయంగా పాపులర్ అయ్యాడు. జపాన్, మలేసియా , సింగపూర్ వంటి దేశాల్లో కూడా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న మొనగాడు. 40 ఏళ్ల కు పైగ నట ప్రయాణం. ఇప్పుడు ఆయన వయసు 65 ఏళ్లు. ఆయన చేస్తున్న రెండు చిత్రాల బడ్జెట్ 6 వందల కోట్లు వరకు ఉందంటే.. ఆయన కమర్షియల్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఆయనెవరో కాదు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ వన్ అండ్ వన్లీ రజనీకాంత్. ఆయన జీవితం తరచి చూస్తే ఒక హాలీవుడ్ సినిమాకు కావాలసినంత స్టఫ్ ఉంటుంది అనడంలో సందేహాం లేదు.
అందుకే మని దిగ్గజ దర్శకుడు మణిరత్నం .. రజనీకాంత్ జీవిత చరిత్రను సినిమాగా చేసే ఆలోచన చేస్తున్నారట. గతంలో నాయకుడు, గురు, ఇద్దరు.. వంటి బయో పిక్ లు చేసిన మణిరత్నం.. రజనీకాంత్ జీవితం గురించి చిత్రం చేస్తే ఎలా వుంటుందో చెప్పనవసరం లేదు. గతంలో రజనీకాంత్.. మహాభారతం ఆధారంగా కథలో కర్ణ , ధుర్యోధనుల స్నేహాబంధాన్ని ప్రేరణ గా చేసిన దళపతి ఒక రేంజ్ లో హిట్ అయ్యింది. మరి అన్ని కుదిరితే .. రజనీకాంత్ లైఫ్ స్టోరి ఆధారంగా రానున్న చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రావోచ్చేమో మరి.