ఈ అమ్మాయి.... ప్రియాంకా గాంధీ కూతురు!
దేశంలోనే పేరున్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఏం సాధించినా, దానికంటే ముందు, వారెవరు అనేదే వార్తవుతుంది. అలా చూస్తే ఇక్కడ హోరాహోరీగా బాస్కెట్ బాల్ ఆడుతున్న అమ్మాయి విషయంలో కూడా ఆమె ఆటకంటే ముందు, ఆమె ఎవరో పరిచయం చేయాల్సి ఉంటుంది. ఈ అమ్మాయి సోనియా గాంధీ మనుమరాలు, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమార్తె మిరయా వాద్రా, పాండిచ్చేరిలో జరుగుతున్న బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిష్ పోటీల్లో హర్యానా తరపున ఆమె ఆడుతోంది, రాజీవ్ గాంధీ […]
దేశంలోనే పేరున్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఏం సాధించినా, దానికంటే ముందు, వారెవరు అనేదే వార్తవుతుంది. అలా చూస్తే ఇక్కడ హోరాహోరీగా బాస్కెట్ బాల్ ఆడుతున్న అమ్మాయి విషయంలో కూడా ఆమె ఆటకంటే ముందు, ఆమె ఎవరో పరిచయం చేయాల్సి ఉంటుంది. ఈ అమ్మాయి సోనియా గాంధీ మనుమరాలు, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమార్తె మిరయా వాద్రా, పాండిచ్చేరిలో జరుగుతున్న బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిష్ పోటీల్లో హర్యానా తరపున ఆమె ఆడుతోంది, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో వచ్చే సోమవారం వరకు జరుగుతున్న 42వ సబ్-జూనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీల్లో మిరయా పాల్గొంటున్నది. కూతురి ఆటని చూసేందుకు ప్రియాంక కూడా పాండిచ్చేరి వచ్చారు. దాంతో వారు ఉంటున్న హోటల్ పరిసరాల్లో భద్రతను పెంచారు. నిన్న జరిగిన తొలిరోజు ఆటలో మిరయా టీమ్ తమిళనాడు జట్టుతో తలపడగా, తమిళనాడు జట్టే విజయం సాధించింది.
మిరయా స్పోర్ట్స్ డ్రస్‌తో 15 నెంబర్‌తో కనిపించింది. ఆమె కోసం మీడియా వ్యక్తులు స్టేడియం మొత్తం చుట్టుముట్టేశారు. చివరగా గ్రూపు ఫొటో తీసుకున్నారు. తమ పిల్లలు హర్యానా నుండి పాండిచ్చేరికి మూడురోజులు ట్రయిన్‌లో ప్రయాణం చేసి రావడంతో అలసిపోయారని, అయినా మొదటి రౌండ్ తప్ప మిగిలిన ఆటంతా బాగానే ఆడారని హర్యానా కోచ్ మతాబ్ సింగ్ అన్నాడు. మిరయా తన ఆట పూర్తి కాగానే, మీడియాని తప్పించుకుంటూ, తన స్నేహితులతో కలిసి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుంది.