యంగ్ టైగర్ సినిమాకు ముహూర్తం ఫిక్స్
ఊహించని విధంగా ఎన్టీఆర్ సినిమా వాయిదా పడింది. ఈనెల 7న సెట్స్ పైకి వెళ్తుందనుకున్న ఈ సినిమా ఆ తర్వాత 16వ తేదీకి వాయిదా పడింది. తాజాగా ఆ తేదీకి కూడా షూటింగ్ మొదలుకాదని తేలింది. ఇప్పుడు మరో డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 20 నుంచి జనతా గ్యారేజీ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ప్రకటించారు. మేకర్స్ చెబుతున్న రీజన్ ఏంటంటే… హైదరాబాద్ లో ఇంకా సెట్ రెడీ కాలేదంటున్నారు. కానీ తాజా సమాచారం […]
BY sarvi3 Feb 2016 4:43 AM IST
X
sarvi Updated On: 3 Feb 2016 4:47 AM IST
ఊహించని విధంగా ఎన్టీఆర్ సినిమా వాయిదా పడింది. ఈనెల 7న సెట్స్ పైకి వెళ్తుందనుకున్న ఈ సినిమా ఆ తర్వాత 16వ తేదీకి వాయిదా పడింది. తాజాగా ఆ తేదీకి కూడా షూటింగ్ మొదలుకాదని తేలింది. ఇప్పుడు మరో డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 20 నుంచి జనతా గ్యారేజీ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ప్రకటించారు. మేకర్స్ చెబుతున్న రీజన్ ఏంటంటే… హైదరాబాద్ లో ఇంకా సెట్ రెడీ కాలేదంటున్నారు. కానీ తాజా సమాచారం ఏంటంటే…. మొదట అనుకున్న రెండు ముహూర్తాలు బాగాలేవని… ఫిబ్రవరి 20 అయితే భేషుగ్గా ఉందని పండితులు చెప్పడమే. అందుకే తారక్ షూటింగ్ కోసం ఆ తేదీని ఫిక్స్ చేశారు. ఇక సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు. శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన మైత్రీ మూవీస్ సంస్థ… .కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనుంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.
Next Story