ప్రపంచాన్ని మార్చడానికి నేను సినిమాలు తీయను!
కెరీర్‌లో ఎత్తుపల్లాలను ఎక్కువగా చూస్తున్న నటుల్లో సిద్ధార్థ ఒకడు. అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని తెచ్చుకోవడంలో మాత్రం అతను విజయం సాధించాడనవచ్చు. ఎవరేమనుకున్నా తాను చేయాలనుకున్నది చేసే నటుడిగా సిద్ధార్థకి పేరుంది. ప్రస్తుతం తమిళంలో ఆయన నటించిన అరాణ్మనై-2 (తెలుగులో కళావతి) విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ మనసులోని మాటలు-
BY sarvi3 Feb 2016 5:21 AM IST
X
sarvi Updated On: 3 Feb 2016 6:41 AM IST
కెరీర్‌లో ఎత్తుపల్లాలను ఎక్కువగా చూస్తున్న నటుల్లో సిద్ధార్థ ఒకడు. అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని తెచ్చుకోవడంలో మాత్రం అతను విజయం సాధించాడనవచ్చు. ఎవరేమనుకున్నా తాను చేయాలనుకున్నది చేసే నటుడిగా సిద్ధార్థకి పేరుంది. ప్రస్తుతం తమిళంలో ఆయన నటించిన అరాణ్మనై-2 (తెలుగులో కళావతి) విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ మనసులోని మాటలు-
- అరాణ్మనై-2 ఈ ఏడాది మొట్టమొదటి బ్లాక్‌బస్టర్ హిట్. ఇది అతిపెద్ద హిట్‌గా నిలవబోతోంది. ఈ సినిమా విజయాన్ని ఎంజాయి చేస్తున్నాను.
- నేను ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నానంటారు. కానీ నా దృష్టిలో మల్టీ స్టారర్, సోలో స్టారర్ అనే తేడాలు లేవు. ఒక సినిమా ఒప్పుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రతి సినిమాకు దేని ప్రత్యేకతలు దానికుంటాయి. కొన్నిసార్లు అతి పెద్ద హిట్‌గా నిలిచిన సినిమా నుండి మనమేమీ నేర్చుకోలేకపోవచ్చు. నటుడిగా ఏలాంటి పేరూ రాకపోవచ్చు.
- నేను నటిస్తూ నిర్మిస్తున్న జిల్ జంగ్ జుక్ పూర్తిగా కమర్షియల్ సినిమా. నేను ప్రపంచాన్ని మార్చడానికో, ప్రయోగాలు చేయడానికో సినిమాలు తీయడం లేదు. ఇది ఒక మంచి కమర్షియల్ సినిమా, అయితే ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలకు భిన్నంగా ఉంటుంది.
- జిల్ జంగ్ జుక్ లో హీరోయిన్ క్యారక్టర్ లేదు. కావాలని హీరోయిన్ లేకుండా చేయాలని ప్లాన్ చేయలేదు. దాని స్క్రిప్ట్ అలా ఉంది అంతే. పనిగట్టుకుని హీరోయిన్ పాత్రని సృష్టిస్తే అది తెలివితక్కువతనంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే సినిమా కేవలం మహిళా పాత్రలతోనే చేయాల్సి వస్తే హీరో పాత్రలేకుండా అలాగే చేసేవాణ్ణి.
- దర్శకుడు సి సుందర్ నాకు మంచి స్నేహితుడు. అయితే మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటం వలన ఒక్కోసారి కలిసి పనిచేయడం బోర్‌గా అనిపించవచ్చు. కానీ నేను రెండు సినిమాలకు కలిసి పనిచేసిన ఏకైక దర్శకుడు ఆయనే కావడం విశేషం. మా ఇద్దరి ఆలోచనల్లో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తానికి వృత్తిపరంగానూ, స్నేహితులుగానూ మా జర్నీ బాగుంది.
- నేను ఆచితూచి నా దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాను అనేది నిజం కాదు. ఎందుకంటే నాకు అంత ఛాయిస్ లేదు. ఇక తక్కువ సినిమాలు ఎందుకు చేస్తున్నాను అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నేను పదమూడేళ్లలో 27 సినిమాలు చేశాను. అమీర్‌ఖాన్ నాలుగేళ్లకు ఒక సినిమా చేస్తాడు మరి.
Next Story