లోకేష్‌కి ఇంత అవమానమా?!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున గర్జించిన నారా లోకేష్‌కు ఒక సర్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో సర్వే నిర్వహించిన వీడీపీ అసోసియేట్స్ సంస్థ ఫలితాలను వెల్లడించింది. ఎన్నికల్లో ఓటర్లకు అత్యధికంగా ప్రభావితం చేసిన నేతలు ఎవరన్న దానిపై పీడీపీ అసోసియేట్స్ సంస్థ సర్వే నిర్వహించింది. అత్యంత ప్రభావశీల నాయకుడిగా మంత్రి కేటీఆర్ అని తేలినట్టు సర్వే వెల్లడించింది. 29 శాతం మందిని టీఆర్‌ఎస్‌కు ఓటేసేలా కేటీఆర్ ప్రభావితం చేసినట్టు తేల్చింది. 22 […]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున గర్జించిన నారా లోకేష్‌కు ఒక సర్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో సర్వే నిర్వహించిన వీడీపీ అసోసియేట్స్ సంస్థ ఫలితాలను వెల్లడించింది. ఎన్నికల్లో ఓటర్లకు అత్యధికంగా ప్రభావితం చేసిన నేతలు ఎవరన్న దానిపై పీడీపీ అసోసియేట్స్ సంస్థ సర్వే నిర్వహించింది.
అత్యంత ప్రభావశీల నాయకుడిగా మంత్రి కేటీఆర్ అని తేలినట్టు సర్వే వెల్లడించింది. 29 శాతం మందిని టీఆర్‌ఎస్‌కు ఓటేసేలా కేటీఆర్ ప్రభావితం చేసినట్టు తేల్చింది. 22 శాతంతో రెండో స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ నిలిచారు. మూడో స్థానం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కింది. ఆయన 11 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. టీడీపీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న లోకేష్‌కు మాత్రం ఊహించని షాకే తగిలింది. కేవలం 3 శాతం మందిని మాత్రమే ఆయన ప్రభావితం చేయగలిగారని సర్వే చెబుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో రేవంత్ 2 శాతం, కిషన్ రెడ్డి 2 శాతంతో ఉన్నారు.
మరోవైపు ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన సర్వేలో అధికార పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. టీఆర్‌ఎస్ 78-82 స్థానాలు గెలిచే అవకాశం ఉందట. టీడీపీ- బీజేపీ కూటమి 28 నుంచి 33 స్థానాలు గెలవవచ్చిని చానల్ సర్వే చెబుతోంది. ఎంఐఎం 35- 40, కాంగ్రెస్ 8- 10 స్థానాల్లో గెలవచ్చని ప్రముఖ తెలుగు టీవీ చానల్ చెబుతోంది. మిగిలిన చోట్ల ఇండిపెండెంట్‌లు గెలవచ్చని వెల్లడించింది.
Click on Image to Read: