బ్రెడ్... మన ఆరోగ్యానికి బెస్ట్ కాదు!
ఇది వరకు ఏదో జ్వరం వచ్చినపుడు తేలికపాటి ఆహారంగా వాడిన బ్రెడ్, ఇప్పుడు చాలా ఇళ్లలో టిపిన్ ప్లేస్‌ని భర్తీ చేస్తోంది. ఉదయాన్నే బ్రెడ్, జామ్‌తో ఉపాహారం అయిందనిపిస్తున్నారు చాలామంది. అయితే ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే ఫరవాలేదు కానీ, అదేపనిగా బ్రెడ్‌ని తినడం అంతమంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకు కారణాలుగా వారు చెబుతున్న వివరాలు- బ్రెడ్‌ల్లో వైట్ బ్రెడ్‌ని మనం దూరంగా పెడితేనే మంచిది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం అసలేమాత్రం ఉండదు. పీచుపదార్థం […]
ఇది వరకు ఏదో జ్వరం వచ్చినపుడు తేలికపాటి ఆహారంగా వాడిన బ్రెడ్, ఇప్పుడు చాలా ఇళ్లలో టిపిన్ ప్లేస్‌ని భర్తీ చేస్తోంది. ఉదయాన్నే బ్రెడ్, జామ్‌తో ఉపాహారం అయిందనిపిస్తున్నారు చాలామంది. అయితే ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే ఫరవాలేదు కానీ, అదేపనిగా బ్రెడ్‌ని తినడం అంతమంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకు కారణాలుగా వారు చెబుతున్న వివరాలు-
- బ్రెడ్‌ల్లో వైట్ బ్రెడ్‌ని మనం దూరంగా పెడితేనే మంచిది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం అసలేమాత్రం ఉండదు. పీచుపదార్థం ఎక్కువగా ఉన్న పదార్థాలు మనకు ఎక్కువ సమయం పొట్టనిండుగా అనిపించేలా చేస్తాయి. కానీ బ్రెడ్‌లో పీచు లేనందున దీన్ని కడుపునిండా తిన్నా కూడా, వెంటనే ఏదో ఒక ఆహారం తీసుకుంటాం. అలా ఎక్కువ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది.
- కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమే అయినా బ్రెడ్‌ని తీసుకుంటే ఇవి అవసరానికి మించి లోపలికి వెళతాయి. అందుకే బ్రెడ్‌ని తరచుగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. ఇందులో ఉన్న పంచదార, ఉప్పు, నిలవ ఉంచేందుకు వాడే రసాయనాలు ఇవన్నీ కూడా బరువుని పెంచుతాయి.
- మన ఆరోగ్యం విషయంలో చూసుకుంటే అన్నిటికంటే చివరగా తెల్లబ్రెడ్ ఉంటుంది. ఎన్నో దశల్లో ప్రాసెస్ చేసిన, తెల్లబరచిన పిండిని దీని తయారీకి వాడతారు. ఇతర బ్రెడ్‌లకంటే విటమిన్ ఇ ఇందులో తక్కువగా ఉంటుంది. అంతేకాక ఇందులో పోషకవిలువలు సైతం చాలా తక్కువగా ఉంటాయి.
- ఆహారంలో ఎక్కువ శాతం బ్రెడ్‌ని ఎక్కువకాలం వాడితే దీర్ఘకాలంలో పోషకాహార లోపం కలుగుతుంది, వైట్ బ్రెడ్‌లో కంటే గోధుమ బ్రెడ్‌లో పోషకాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. తృణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ మరికాస్త బెటర్. కాకపోతే వీటన్నింటిలోనూ పళ్లు, నట్స్ కూరగాయలతో పోలిస్తే పోషకాలు చాలా తక్కువ. కాబట్టి దీన్ని తరచుగా స్నాక్‌గా తినకపోవడమే మంచిది.
- ఏరకం బ్రెడ్‌లో అయినా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు రోజుకి 2300 మిల్లీ గ్రాములను మించి ఉప్పుని తీసుకోకూడదు. అలా చూసుకుంటే బ్రెడ్‌ని ఇలాంటి సమస్యలు ఉన్నవారు తరచుగా తీసుకుంటే మరింత హానికరంగా మారుతుంది.
- బ్రెడ్ తయారీకి పిండిని తయారుచేసుకునే ప్రాసెస్‌లో వినియోగించే రసాయనాలు, జన్యుపరంగా రూపాంతరం చెందించిన సోయా లెసిథిన్, కార్న్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సోయాపిండి లాంటివి, కృత్రిమమైన ఫ్లేవర్లు, నిలవ ఉంచే రసాయనాలు, మితిమీరిన చెక్కెర ఇవన్నీ బ్రెడ్ లో ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవి కావు. కనుక బ్రెడ్‌ని ఎంత తక్కువ తింటే అంత మంచిది.