బొత్స లాజిక్‌కు సమాధానం కష్టమే!
తుని ఘటన వెనుక వైసీపీ హస్తముందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ చేసిన విరుద్ద ప్రకటనను ప్రస్తావించారు బొత్స. ప్రభుత్వ ధ్వంద్వ వైఖరికి సీఎం, మంత్రుల ప్రకటన మధ్య వ్యత్యాసమే నిదర్శనమన్నారు. తుని విధ్వంసం వెనుక జగన్ హస్తముందని చంద్రబాబు, చినరాజప్ప ఆరోపించగా… అదే సమయంలో మంత్రి నారాయణ మాత్రం ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా జనాన్ని రెచ్చగొట్టడం వల్లే విధ్వంసం జరిగిందని మీడియాతో […]
తుని ఘటన వెనుక వైసీపీ హస్తముందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ చేసిన విరుద్ద ప్రకటనను ప్రస్తావించారు బొత్స. ప్రభుత్వ ధ్వంద్వ వైఖరికి సీఎం, మంత్రుల ప్రకటన మధ్య వ్యత్యాసమే నిదర్శనమన్నారు. తుని విధ్వంసం వెనుక జగన్ హస్తముందని చంద్రబాబు, చినరాజప్ప ఆరోపించగా… అదే సమయంలో మంత్రి నారాయణ మాత్రం ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా జనాన్ని రెచ్చగొట్టడం వల్లే విధ్వంసం జరిగిందని మీడియాతో చెప్పడాన్ని బొత్స ఎత్తిచూపారు.
సమస్యను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారన్న విషయం అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో కుల రాజకీయాలను ప్రేరేపిస్తున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించకుండా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని బొత్స ఆరోపించారు. కాపుల రిజర్వేషన్ల అంశం చాలాకాలంగా ఉన్నప్పటికీ మొన్నటి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చినందుకే కాపులు నిలదీస్తున్నారని బొత్స అన్నారు.
ప్రభుత్వంపై చంద్రబాబుకు పట్టులేదని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. 1994లో ముద్రగడ దీక్ష చేస్తే టీడీపీ నేతగా చంద్రబాబు స్వయంగా వెళ్లి సంఘీభావం తెలపలేదా అని అన్నారు. చంద్రబాబు చేస్తే కరెక్ట్ ఇతరులు చేస్తే తప్పా అని ప్రశ్నించారు.
స్పీకర్ కోడెల శివప్రసాదరావుపైనా బొత్స తీవ్రంగా స్పందించారు. వంగవీటి రంగా హత్య వెనుక కోడెల శివప్రసాదరావు పన్నాగం ఉందన్న ఆరోపణ నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గుర్తించి కేబినెట్ నుంచి భర్తరఫ్ చేసేందుకు సిద్ధపడగా అయిష్టంగానే కోడెల రాజీనామా చేశారని బొత్స అన్నారు. కోడెల శివప్రసాదరావు ఇంట్లో బాంబులు పేలిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉన్నత పదవిలో ఉంటూ ఇష్టానుసారం మాట్లాడడం తగదన్నారు. ఎవరి అరాచకం ఎంతో ప్రజలందరికీ తెలుసన్నారు బొత్స.
Click on Image to Read: