కాసేపు కంగారు పడ్డ టీవీ చానళ్లు
కాపు గర్జన సభ ప్రభుత్వాన్ని ఎంతగా భయపెట్టిందో గానీ మెజారిటీ తెలుగు న్యూస్ చానళ్లు మాత్రం కాసేపు కంగారుపడ్డట్టు కనిపించింది. కాపు గర్జన సభకు మెజారిటీ టీవీ చానళ్లు చాలా తక్కువ కవరేజ్ ఇచ్చాయి. ముద్రగడ ప్రసంగాన్ని లైవ్ ఇచ్చిన చానళ్లు … రైలు పట్టాలపైకి వెళ్దామని ఆయన పిలుపునివ్వగానే ఒక్కసారిగా పక్కదారి పట్టాయి. సాధారణంగా లక్షలాది మంది రైలు పట్టాలపైకి వెళ్తున్నారంటే టీవీ చానళ్లు అన్ని కార్యక్రమాలకు స్వస్తి పలికి దాన్నే కవర్ చేస్తాయి. కానీ […]

కాపు గర్జన సభ ప్రభుత్వాన్ని ఎంతగా భయపెట్టిందో గానీ మెజారిటీ తెలుగు న్యూస్ చానళ్లు మాత్రం కాసేపు కంగారుపడ్డట్టు కనిపించింది. కాపు గర్జన సభకు మెజారిటీ టీవీ చానళ్లు చాలా తక్కువ కవరేజ్ ఇచ్చాయి. ముద్రగడ ప్రసంగాన్ని లైవ్ ఇచ్చిన చానళ్లు … రైలు పట్టాలపైకి వెళ్దామని ఆయన పిలుపునివ్వగానే ఒక్కసారిగా పక్కదారి పట్టాయి. సాధారణంగా లక్షలాది మంది రైలు పట్టాలపైకి వెళ్తున్నారంటే టీవీ చానళ్లు అన్ని కార్యక్రమాలకు స్వస్తి పలికి దాన్నే కవర్ చేస్తాయి. కానీ మన టీవీ చానళ్లు మాత్రం తునిలో తగలబడే సంఘటనలు జరుగుతుంటే రకరకాలుగా విన్యాసాలు చేశాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక చానల్ మాత్రం నిరంతరాయంగా కాపు గర్జనకు కవరేజ్ ఇవ్వడం విశేషం.
గ్రేటర్ ప్రచారం ముగిసిందంటూ కాసేపు హడావుడి చేశాయి. మరికాసేపు లోకేష్ బైక్ ర్యాలీ చూపించారు. కొద్దిసేపు ఎన్నికల అధికారి లైవ్ ఇచ్చుకుంటూ కూర్చున్నాయి. చివరకు అరగంట ప్రకటనలకు వెళ్లిపోయాయి చానళ్లు. తాయత్తులు, నాప్‌టాల్, కీళ్ల నొప్పుల ఆయిల్ వంటి ప్రకటనలతో కాలం గడిపేశాయి. సరే ఆందోళన కార్యక్రమాలను చూపించి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకూడదన్న ఉద్దేశంతో టీవీ చానళ్లు ఇలా చేశాయా అంటే అదీ లేదు. కాపులు ఆందోళన చేస్తుంటే కవరేజ్ ఇవ్వని చానళ్లు… తీరా అక్కడ రైలుకు నిప్పు పెట్టి, పోలీసులపై దాడులు మొదలైన తర్వాత రంగంలోకి దిగాయి. కార్యక్రమం హింసాత్మకం అయిందని చూపేందుకు తాపత్రయపడ్డాయి. కాపు గర్జన సభలో నాయకులేమన్నారు అన్నది పక్కన పెట్టేసి … టీడీపీ నేతల ఎదురుదాడి స్టేట్‌మెంట్లకు బాగా ప్రచారం కల్పించాయి టీవీ చానళ్లు. ఇంత చేసి ఏమన్నా సాధించాయా అంటే అదీ లేదు. చివరకు టీవీ చానళ్లు సంయమనం పాటించవా…? అంటూ చంద్రబాబు నుంచి సెటైర్లు వేయించుకోవాల్సి వచ్చింది.
Click on Image to Read: