ఆడోళ్లతో కొట్టిస్తా..!, దా ఎంతమందిని కొట్టిస్తావో..!
బీజేపీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై మహిళలు తిరగబడ్డారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మీర్‌పేట్‌కు వెళ్లిన ఆయన అక్కడున్న టీఆర్ఎస్ మహిళా నేతతో డబ్బులు పంచుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. ”ఇక్కడ మీకు ఒక్క ఓటు కూడా పడదు. ఇక్కడున్న ఆడోళ్లతోనే కొట్టిస్తా… తరిమి తరిమి కొట్టిస్తా” అంటూ టీఆర్ఎస్ మహిళా నేతను ఉద్దేశించి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌కు సంబంధించిన మహిళలు తిరగబడ్డారు. అప్పటి వరకు దూరంగా ఉన్న మహిళలు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. ”ఏది దా […]

బీజేపీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై మహిళలు తిరగబడ్డారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మీర్‌పేట్‌కు వెళ్లిన ఆయన అక్కడున్న టీఆర్ఎస్ మహిళా నేతతో డబ్బులు పంచుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. ”ఇక్కడ మీకు ఒక్క ఓటు కూడా పడదు. ఇక్కడున్న ఆడోళ్లతోనే కొట్టిస్తా… తరిమి తరిమి కొట్టిస్తా” అంటూ టీఆర్ఎస్ మహిళా నేతను ఉద్దేశించి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌కు సంబంధించిన మహిళలు తిరగబడ్డారు. అప్పటి వరకు దూరంగా ఉన్న మహిళలు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. ”ఏది దా కొట్టించు.. ఎలా కొట్టిస్తావో చూస్తాం.. ఎంత మందిని కొడుతావో కొట్టించు, నీవేమైనా హీరోవా” అంటూ కాసేపు ఎమ్మెల్యేకు చెమటలు పట్టించారు. పరిస్థితి కాస్త సీరియస్ అవడంతో ఎమ్మెల్యే మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. watch video…
Click on Image to Read: