Telugu Global
Others

కాపుల్లో ఇంత మార్పా?

పవన్‌ కల్యాణ్‌. మొన్నటి ఎన్నికలకు ముందు తమకు పవన్ అనే ఒక నాయకుడు ఉన్నాడని కాపులు గర్వంగా చెప్పుకున్నారు. ఆయన పిలుపుతో ఏకతాటిపైకి వచ్చి టీడీపీకి ఓట్లేశారు. చంద్రబాబును గద్దెనెక్కించారు. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తోంది. ఆదివారం జరిగిన కాపు గర్జన సభను గమనిస్తే అది స్పష్టంగా అర్థమవుతోంది. కడుపు మండి కాపులు గర్జించిన సభలో ఎక్కడా కూడా పవన్ ఊసే లేదు. సభకు భారీగా యువత వచ్చినప్పటికీ పవన్‌ గురించి ఎక్కడా నినాదాలు చేయలేదు. […]

కాపుల్లో ఇంత మార్పా?
X

పవన్‌ కల్యాణ్‌. మొన్నటి ఎన్నికలకు ముందు తమకు పవన్ అనే ఒక నాయకుడు ఉన్నాడని కాపులు గర్వంగా చెప్పుకున్నారు. ఆయన పిలుపుతో ఏకతాటిపైకి వచ్చి టీడీపీకి ఓట్లేశారు. చంద్రబాబును గద్దెనెక్కించారు. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తోంది. ఆదివారం జరిగిన కాపు గర్జన సభను గమనిస్తే అది స్పష్టంగా అర్థమవుతోంది.

కడుపు మండి కాపులు గర్జించిన సభలో ఎక్కడా కూడా పవన్ ఊసే లేదు. సభకు భారీగా యువత వచ్చినప్పటికీ పవన్‌ గురించి ఎక్కడా నినాదాలు చేయలేదు. పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేదు. ఈ పరిణామంపై పవన్ అనుచరులు ఒకింత షాక్ అయ్యారు.

ఎన్నికల్లో పవన్‌ పిలుపుకు పోటెత్తిన కాపులు ఇప్పుడెందుకు ఇలా మారిపోయారని ఆలోచనలో పడ్డారు. చంద్రబాబుతో పవన్ మరీ సన్నిహితంగా ఉండడమే ఇందుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. చంద్రబాబుపై తమకున్న కోపాన్నిపరోక్షంగా పవన్‌పైనా కాపులు చూపుతున్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడో 1988 డిసెంబర్ 26వ తేదీన హత్యకు గురైన వంగవీటి రంగా పేరే కాపు గర్జనలో మార్మోగింది. రంగా భారీ విగ్రహాన్ని సభావేదికపై ప్రదర్శించారు. కాపు హీరో రంగా అంటూ నినాదాలు చేశారు. అయితే ఇప్పటి వరకు కాపులు వెంట ఉన్నారనుకున్న పవన్ నామస్మరణ మాత్రం ఎక్కడా వినిపించలేదు.

చంద్రబాబుతో సన్నిహితంగా ఉండడం, రాజకీయంగా స్పష్టత లేకపోవడం వంటి కారణాల వల్లే పవన్‌పై కాపు యువతకు నమ్మకం తగ్గిఉండవచ్చని భావిస్తున్నారు. ఇలా కాపుల్లోనే నమ్మకం కోల్పోతే భవిష్యత్తులో పవన్ రాజకీయంగా ఎదగడం కష్టమేనని అభిప్రాయడుతున్నారు. అసలు కాపు రిజర్వేషన్లపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి!.

Click on Image to Read:

ఈ మాత్రానికి కేరళ నుంచి రావాలా…తమ్ముడూ!

పవన్‌ ప్రశ్నిస్తారనుకున్నా.. అభిమాని సూసైడ్‌ నోట్‌

ధ్వజమెత్తిన చిరు.. విజయశాంతి మద్దతు

కాసేపు కంగారు పడ్డ టీవీ చానళ్లు

ఆయన సలహా విని ఉంటే ఇలా జరిగేది కాదేమో?

ఇప్పుడేమంటారు?

భలే వాడేశావ్ బాస్‌..!

ఆడోళ్లతో కొట్టిస్తా..!, దా ఎంతమందిని కొట్టిస్తావో..!

కాపు గర్జన- రైలుకు నిప్పు, బోగీలు దగ్ధం

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత ఉందా?!

కేసీఆర్ భార్యకే అర్థం కావ‌డం లేదట‌ ..

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

కేటీఆర్‌కు ప్రమోషన్ ప్రకటించిన కేసీఆర్

బాలకృష్ణ ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

First Published:  1 Feb 2016 12:55 AM GMT
Next Story