ధ్వజమెత్తిన చిరు.. విజయశాంతి మద్దతు
తుని ఘటన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి స్పందించారు. చంద్రబాబుకు ఘాటైన లేఖ రాశారు. ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. పారదర్శకత లేని మీ పాలన వల్లే తుని ఘటన చోటు చేసుకుందని మెగాస్టార్ మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు చెప్పారని.. కానీ అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. రాజధాని […]
తుని ఘటన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి స్పందించారు. చంద్రబాబుకు ఘాటైన లేఖ రాశారు. ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. పారదర్శకత లేని మీ పాలన వల్లే తుని ఘటన చోటు చేసుకుందని మెగాస్టార్ మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు చెప్పారని.. కానీ అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణంలోనూ పారదర్శకత లోపించిందన్నారు. లోపాలను ఎత్తిచూపే వారిపై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయకపోతే కాపులు, బీసీలు, మహిళలే కాదు… రాజధానికి భూములిచ్చినవారు సైతం రోడ్డెక్కి ఉద్యమం చేస్తారని చిరంజీవి హెచ్చరించారు. కాపులను బీసీల్లో చేర్చేలా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపాలని చిరు డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే కాపు కార్పొరేషన్‌కు వంద కోట్లు మాత్రమే కేటాయించామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు చేస్తున్న దుబారా చూసిన తర్వాత డబ్బులు లేవంటే ఎవరైనా నమ్ముతారా అని చిరు తన లేఖలో ప్రశ్నించారు.
నటి, మాజీ ఎంపీ విజయశాంతి కూడా కాపు రిజర్వేషన్లకు, చిరంజీవికి మద్దతు పలికారు. కాపు రిజర్వేషన్లపై చిరు స్పందనతో తాను ఏకీభావిస్తున్నానని తనను కలిసిన విలేకర్లతో చెప్పారామె. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు బీసీలకు నష్టం వాటిల్లకుండా కాపుల సమస్యను పరిష్కరించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
Click on Image to Read: