Telugu Global
Others

ఆయన సలహా విని ఉంటే ఇలా జరిగేది కాదేమో?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ క్టిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ సమయంలో చంద్రబాబులాంటి అనుభవజ్ఞడు అయితే అంతో ఇంతో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో జనం నమ్మకంతో ఓట్లేశారు. కానీ చంద్రబాబు చూపంతా హైదరాబాద్‌ మీదే ఉంది. లేటెస్ట్‌గా తుని కాపు సభ హింసాత్మకంగా మారడం వెనుక ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాపు సభ నిర్వహిస్తున్నారని… లక్షలాది మంది తరలివస్తారని ప్రభుత్వానికి చాలా రోజుల క్రితమే తెలుసు. కానీ సభ పర్యవసాలను లెక్క కట్టడంలో మాత్రం విఫలమైంది. ఒక […]

ఆయన సలహా విని ఉంటే ఇలా జరిగేది కాదేమో?
X

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ క్టిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ సమయంలో చంద్రబాబులాంటి అనుభవజ్ఞడు అయితే అంతో ఇంతో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో జనం నమ్మకంతో ఓట్లేశారు. కానీ చంద్రబాబు చూపంతా హైదరాబాద్‌ మీదే ఉంది. లేటెస్ట్‌గా తుని కాపు సభ హింసాత్మకంగా మారడం వెనుక ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాపు సభ నిర్వహిస్తున్నారని… లక్షలాది మంది తరలివస్తారని ప్రభుత్వానికి చాలా రోజుల క్రితమే తెలుసు. కానీ సభ పర్యవసాలను లెక్క కట్టడంలో మాత్రం విఫలమైంది. ఒక విధంగా చెప్పలంటే నిర్లక్ష్యం ప్రదర్శించింది.

ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్న సమయంలో పరిస్థితిని చక్కదిద్దడంలో బిజీగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు గత కొద్ది రోజులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో మకాం వేశారు. ”హైదరాబాద్ నా మానస పుత్రిక, నగరం ప్రశాంతంగా ఉంచా, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లా” అంటూ పక్క రాష్ట్ర నగరంలోని ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కంపెనీ బిజీగా గడిపేసింది. ఏపీ మంత్రులకు హైదరాబాద్‌లో ఒక్కో డివిజన్ అప్పగించి గెలుపు బాధ్యతలను వారి నెత్త్తిన పెట్టారు. దీంతో వారు కూడా సొంత రాష్ట్రం సంగతులు మరచి… పక్క రాష్ట్రంలో పాగాకు ప్రయత్నించారు. ఇదే కొంప ముంచింది.

చంద్రబాబు, ఆయన మంత్రులు అంతా గ్రేటర్‌ ఎన్నికల్లో మునిగిపోయి అసలు కాపు గర్జన సభలో ఏం జరుగుతుందో కూడా అంచనా వేయకుండా లైట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా చాలా మంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ చెప్పినట్టు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను చూసుకుంటూ ఉండిఉంటే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి ఉండేవి కాదంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు గారు రాజ్యవిస్తరణ ఆకాంక్షను వదిలిపెట్టి కేవలం ఏపీ మీదే ఫోకస్‌ పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

కాపుల్లో ఇంత మార్పా?

కాసేపు కంగారు పడ్డ టీవీ చానళ్లు

ఇప్పుడేమంటారు?

భలే వాడేశావ్ బాస్‌..!

కాపు గర్జన- రైలుకు నిప్పు, బోగీలు దగ్ధం

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత ఉందా?!

కేసీఆర్ భార్యకే అర్థం కావ‌డం లేదట‌ ..

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

కేటీఆర్‌కు ప్రమోషన్ ప్రకటించిన కేసీఆర్

బాలకృష్ణ ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

First Published:  1 Feb 2016 12:00 AM GMT
Next Story