Telugu Global
Cinema & Entertainment

అనుష్క‌ ఉంది... సమంత కూడా ఉంది

ఈమధ్య ఎక్కడ చూసినా ఇదే వార్త. అనుష్క స్థానాన్ని సమంత భర్తీ చేసిందంటూ కథనాలు. కృష్ణవంశీ త్వరలోనే తెరకెక్కించనున్న రుద్రాక్ష అనే సినిమాకు మొదట అనుష్కను అనుకున్నారు. కానీ ఆమెను తప్పించి ఆ స్థానంలో సమంతను తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే సమంతను తీసుకున్నది వాస్తవమే అయినప్పటికీ…తమ సినిమాలో అనుష్క కూడా ఉందని చెబుతోంది సినిమా యూనిట్. అవును… రుద్రాక్ష సినిమాలో అనుష్క, సమంత ఇద్దరూ నటిస్తారట. కథలో అలా రెండు ప్రధాన పాత్రలు ఉంటాయట. ఈ […]

అనుష్క‌ ఉంది... సమంత కూడా ఉంది
X

ఈమధ్య ఎక్కడ చూసినా ఇదే వార్త. అనుష్క స్థానాన్ని సమంత భర్తీ చేసిందంటూ కథనాలు. కృష్ణవంశీ త్వరలోనే తెరకెక్కించనున్న రుద్రాక్ష అనే సినిమాకు మొదట అనుష్కను అనుకున్నారు. కానీ ఆమెను తప్పించి ఆ స్థానంలో సమంతను తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే సమంతను తీసుకున్నది వాస్తవమే అయినప్పటికీ…తమ సినిమాలో అనుష్క కూడా ఉందని చెబుతోంది సినిమా యూనిట్. అవును… రుద్రాక్ష సినిమాలో అనుష్క, సమంత ఇద్దరూ నటిస్తారట. కథలో అలా రెండు ప్రధాన పాత్రలు ఉంటాయట. ఈ రెండు పాత్రలే కాకుండా…. మరో కీలకమైన మూడో పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేశామని కూడా మేకర్స్ ప్రకటించారు. సో… పూర్తిస్థాయి ఫిమేల్ ఓరియెంటడ్ సినిమాగా… సస్పెన్స్ థ్రిల్లర్ గా…. రుద్రాక్ష తెరకెక్కనుందన్నమాట. అన్నట్టు… చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ చేయబోతున్న సినిమా ఇదే కావడం మరో విశేషం.

First Published:  31 Jan 2016 7:01 PM
Next Story