నాగార్జునకీ కనబడనున్న బంగార్రాజు
వచ్చే సంక్రాంతికి అప్పుడే సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. ఈ సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో విజయాన్నందుకున్న నాగ్… వచ్చే సంక్రాంతికి ఆ సినిమా సీక్వెల్ ను సిద్ధం చేయాలని భావిస్తున్నాడు. ఆ సీక్వెల్ మూవీకి బంగార్రాజు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాసుకునే పనిలో కల్యాణ్ కృష్ణ బిజీగా ఉన్నాడు. తొలి భాగంలో… బంగార్రాజు పాత్ర క్లిక్ అవ్వడంతో…. ఆ పేరునే సినిమా పేరుగా మార్చేసి… […]
BY admin1 Feb 2016 12:34 AM IST
X
admin Updated On: 1 Feb 2016 9:38 AM IST
వచ్చే సంక్రాంతికి అప్పుడే సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. ఈ సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో విజయాన్నందుకున్న నాగ్… వచ్చే సంక్రాంతికి ఆ సినిమా సీక్వెల్ ను సిద్ధం చేయాలని భావిస్తున్నాడు. ఆ సీక్వెల్ మూవీకి బంగార్రాజు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాసుకునే పనిలో కల్యాణ్ కృష్ణ బిజీగా ఉన్నాడు. తొలి భాగంలో… బంగార్రాజు పాత్ర క్లిక్ అవ్వడంతో…. ఆ పేరునే సినిమా పేరుగా మార్చేసి… క్యారెక్టరైజేషన్ ను కూడా బాగా పెంచుతున్నారు. సోగ్గాడే సినిమాలో ఉన్న టీం మొత్తం బంగార్రాజు మూవీలో ఉంటుంది. కాకపోతే… తొలి భాగంగా రమ్యకృష్ణకు మాత్రమే కనిపించిన బంగార్రాజు…. సీక్వెల్ లో నాగార్జునకు కూడా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. సో… ఈసారి బంగార్రాజు మరింత మెరవబోతున్నాడన్నమాట.
Next Story