Telugu Global
Others

ఫైటింగ్ సీన్ జ‌స్ట్ మిస్- గొడ‌వ‌కు మూలం ఏంటంటే ?

అనంతపురంలో టీడీపీ నేతల అధిపత్య పోరాటం తీవ్రరూపం దాల్చింది. వీరి అధిపత్య ప్రదర్శనకు గాంధీ వర్ధంతి సభ వేదికైంది. కొంతకాలంగా జేసీ బ్రదర్స్ కు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా గాంధీ వర్థంతి సభను పాతూరులో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి వచ్చారు. వారి వెంట భారీగా అనుచరులు తరలివచ్చారు. గాందీ విగ్రహానికి పూలమాల వేసి […]

ఫైటింగ్ సీన్ జ‌స్ట్ మిస్- గొడ‌వ‌కు మూలం ఏంటంటే ?
X

అనంతపురంలో టీడీపీ నేతల అధిపత్య పోరాటం తీవ్రరూపం దాల్చింది. వీరి అధిపత్య ప్రదర్శనకు గాంధీ వర్ధంతి సభ వేదికైంది. కొంతకాలంగా జేసీ బ్రదర్స్ కు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా గాంధీ వర్థంతి సభను పాతూరులో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి వచ్చారు. వారి వెంట భారీగా అనుచరులు తరలివచ్చారు. గాందీ విగ్రహానికి పూలమాల వేసి జేసీ వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. కానీ జేసీ బ్రదర్స్ మాత్రం ఎమ్మెల్యే బహిరంగసభకు ఎదురుగా రోడ్డుపైనే మకాం వేశారు. జేసీ బ్రదర్స్ పై ఎమ్మెల్యే విమర్శలు చేస్తారని సమాచారంతోనే జేసీ బ్రదర్స్ అక్కడే నిలబడ్డారని చెబుతున్నారు.

వేదికపైన ఎమ్మెల్యే తమ గురించి నెగిటివ్ గా మాట్లాడితే సంగతి తేల్చాలన్న ఉద్దేశంతో జేసీ బ్రదర్స్ వచ్చారని చెబుతున్నారు. దాదాపు రెండు గంటల పాటు సభ ముగిసే వరకూ జేసీ బద్రర్స్ ఎమ్మెల్యే సభకు ఎదురుగా రోడ్డుపైనే తిష్టవేశారు. రెండు వర్గాల వారు భారీగా మోహరించడంతో పోలీసులకు చెమటలు పట్టాయి. భారీగా బలగాలను రంగంలోకి దింపారు. ఉన్నతాధికారుల విజ్ఞప్తితో జేసీ బ్రదర్స్ చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జేసీ బ్రదర్స్ పై ఎమ్మెల్యే ఏమాత్రం నోరు జారినా పెద్ద గొడవ జరిగేదని అభిప్రాయపడుతున్నారు. వీరి వివాదానికి అసలు కారణం ఏమిటంటే…

అనంతపురం నగరంలోకి వాహనాలు తిలక్ రోడ్డు ద్వారానే ఎంటర్ అవ్వాలి. కానీ ఆ రోడ్డు నగరంలోనే అత్యంత ఇరుకైనదిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యమైన రోడ్డు ఇంత ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తిలక్ రోడ్డు, గాంధీ బజార్ రోడ్డును విస్తరించాలని భావించారు. రోడ్ల పరిస్థితిని చంద్రబాబుకు వివరించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. అంతే కాదు 80 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించారు. ఇక్కడే స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎంటరయ్యారు.

రోడ్లను ఎట్టి పరిస్థితిలో విస్తరించడానికి వీల్లేదంటున్నారు. ఇరుకైన రోడ్లను వెడల్పు చేస్తామంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే తన లెక్కలు తనకున్నాయంటున్నారు. ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే తిలక్ రోడ్డు, గాంధీ బజార్‌ రోడ్లను వెడల్పు చేయబోమని… మీ మీ నిర్మాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రభాకర్ చౌదరి స్థానికులకు మాట ఇచ్చారట. అందుకే తనకు ఆ ప్రాంతం వారు ఓట్లేసి గెలిపించారని… కాబట్టి మాట నిలబెట్టుకోవడంలో భాగంగా రోడ్ల విస్తరణకు తాను ఒప్పుకోనంటున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. అప్పటి నుంచే వీరి మధ్య గొడవ మొదలవడానికి ఒక కారణం.

Click on image to read:

kapu-garjana

కేసీఆర్ భార్యకే అర్థం కావ‌డం లేదట‌ ..

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత ఉందా?!

కేటీఆర్‌కు ప్రమోషన్ ప్రకటించిన కేసీఆర్

బాలకృష్ణ ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

First Published:  31 Jan 2016 3:45 AM IST
Next Story