బాలయ్య ను అలా పడేసాడు..!
ఎంతటి వారికైన కొన్ని బలహీనతలుంటాయి. బాలయ్య బాబుకు వాళ్ల నాన్న నందమూరి తారకరామారావు అంటే ఎంత ప్రేమో చెప్పడం కష్టం. తనకు ప్రతి క్షణం ప్రేరణ తన తండ్రే అని చెబుతారు. కట్ చేస్తే..ఇదే బలహీనతను పటాస్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెలివిగా క్యాచ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. నందమూరి తారక రామారావు అంటే తెలుగు వారందరికీ అన్నలాంటి వారు. నటుడిగా.. జననాయకుడిగా ఆయనకున్న ఖ్యాతి ఒక తరం జన హృదయాల్లో పదిలంగా ఉంది. అందుకే డైరెక్టర్ అనిల్ […]
BY admin31 Jan 2016 12:56 AM IST

X
admin Updated On: 31 Jan 2016 3:02 PM IST
ఎంతటి వారికైన కొన్ని బలహీనతలుంటాయి. బాలయ్య బాబుకు వాళ్ల నాన్న నందమూరి తారకరామారావు అంటే ఎంత ప్రేమో చెప్పడం కష్టం. తనకు ప్రతి క్షణం ప్రేరణ తన తండ్రే అని చెబుతారు. కట్ చేస్తే..ఇదే బలహీనతను పటాస్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెలివిగా క్యాచ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. నందమూరి తారక రామారావు అంటే తెలుగు వారందరికీ అన్నలాంటి వారు. నటుడిగా.. జననాయకుడిగా ఆయనకున్న ఖ్యాతి ఒక తరం జన హృదయాల్లో పదిలంగా ఉంది. అందుకే డైరెక్టర్ అనిల్ రావిపూడి రామారావు గారు అనే టైటిల్ తో బాలకృష్ణకు ఒక స్టోరి లైన్ వినిపించారట. బాలయ్యకు ఆల్మోస్ట్ ఆ లైన్ నచ్చేసినట్లే చెబుతున్నారు. స్టోరి ని బాగా డెవలప్ చేయమని దర్శకుడిగా బాలయ్య చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఈ చిత్రం ట్రాక్ ఎక్కితే .. బాలయ్య 100వ చిత్రంగా వస్తుందో.. లేక 101 వ సినిమాగా వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Next Story