అప్పుడేమయ్యావ్... రాహుల్
హెచ్‌సీయూలో రాహుల్ గాంధీ దీక్షపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. యూనివర్శిటీలో వాతావరణాన్ని రాహుల్ కలుషితం చేస్తున్నారని విమర్శించారు. రోహిత్ ఆత్మహత్యపై కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు. యూపీఏ హయాంలో ఇదే హెచ్‌సీయూలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య ఇంటిలో ఆయన కోడలు, చిన్నారులు చనిపోయినప్పుడు రాహుల్ ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. కేరళలో కుంభకోణాలపై రాహుల్ ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు.