Telugu Global
NEWS

నిరాహర దీక్షకు దిగిన రాహుల్

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్శిటీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండోసారి క్యాంపస్‌కు వచ్చారు. అర్థరాత్రి 12.30 గంటలకు రాహుల్ హెచ్‌సీయూకు వచ్చారు. రాహుల్ వచ్చిన వెంటనే విద్యార్థులు 18గంటల నిరాహారదీక్షను ప్రారంభించారు. రాహుల్ కూడా విద్యార్థులతో పాటు నిరాహార దీక్షలో కూర్చుకున్నారు. శనివారం సాయంత్రం వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది. అయితే రాహుల్‌ రాకపై ఏబీవీపీ ఆందోళనకు […]

నిరాహర దీక్షకు దిగిన రాహుల్
X

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్శిటీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండోసారి క్యాంపస్‌కు వచ్చారు. అర్థరాత్రి 12.30 గంటలకు రాహుల్ హెచ్‌సీయూకు వచ్చారు. రాహుల్ వచ్చిన వెంటనే విద్యార్థులు 18గంటల నిరాహారదీక్షను ప్రారంభించారు. రాహుల్ కూడా విద్యార్థులతో పాటు నిరాహార దీక్షలో కూర్చుకున్నారు. శనివారం సాయంత్రం వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది. అయితే రాహుల్‌ రాకపై ఏబీవీపీ ఆందోళనకు దిగింది. రాహుల్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. అయితే వర్శిటీకి వచ్చిన రాహుల్ గాంధీ తన వెంట కాంగ్రెస్ నేతలను అనుమతించలేదు. కేవలం ఒకరిద్దరు యువనాయకులను మాత్రం లోనికి తీసుకెళ్లారు రాహుల్.

First Published:  30 Jan 2016 4:08 AM IST
Next Story