ఉలిక్కిపడిన టీడీపీ- మెరుపు వేగంతో లోకేష్ ట్వీట్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు భార్య, తన వదిన భువనేశ్వరి కూడా టీఆర్ఎస్‌కే ఓటేస్తున్నారని ఈ మేరకు ఆమె మాట ఇచ్చారంటూ సభలో కేసీఆర్ చెప్పారు. భువనేశ్వరికి నిజాయితీ ఉంది కాబట్టే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తున్నారని అన్నారు. భువనేశ్వరిని వదిన అని పిలవడంతో పాటు ఆమె టీఆర్ఎస్‌కు ఓటేస్తారని చెప్పడం వల్ల తమ పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందారు. […]
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు భార్య, తన వదిన భువనేశ్వరి కూడా టీఆర్ఎస్‌కే ఓటేస్తున్నారని ఈ మేరకు ఆమె మాట ఇచ్చారంటూ సభలో కేసీఆర్ చెప్పారు. భువనేశ్వరికి నిజాయితీ ఉంది కాబట్టే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తున్నారని అన్నారు. భువనేశ్వరిని వదిన అని పిలవడంతో పాటు ఆమె టీఆర్ఎస్‌కు ఓటేస్తారని చెప్పడం వల్ల తమ పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందారు. దీంతో వెంటనే లోకేష్ తన ట్విట్టర్ ద్వారా కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.
తన తల్లి భువనేశ్వరి పేరుతో ట్వీట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఇలా అబద్ధాలు చెప్పడం దారుణమని ట్వీట్ చేశారు. ఓటర్లను తికమక పెట్టేందుకు తమను ఇలా వాడుకోవడం బాధాకరమని భువనేశ్వరి అభిప్రాయపడినట్టు లోకేష్ ట్వీట్‌లో వెల్లడించారు. ఎప్పటికీ తాము టీడీపీకే ఓటేస్తామని చెప్పారు. అయితే ఇటీవల చంద్రబాబు, కేసీఆర్ ఒకటైపోయారని బాగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో భువనేశ్వరిని కేసీఆర్ వదిన అని పిలవడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఓటర్లలో టీఆర్ఎస్‌పై సానుకూలత పెంచేందుకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
Click on image to read: