Telugu Global
Others

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్‌ రకరకాల ఎత్తులు వేస్తోంది. ఒక వైపు చంద్రబాబును తిడుతూనే టీడీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా మైండ్ గేమ్ ఆడుతోంది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్ … చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీలో వెళ్లి పనిచేసుకోవాల్సిందిగా చంద్రబాబును తాను కోరితే ఆయన మాత్రం వదల బొమ్మాళీ వదల అన్నట్టు హైదరాబాద్‌ను పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ వదిలి వెళ్లాలని తామేమైనా అన్నామా అని ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో […]

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది
X

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్‌ రకరకాల ఎత్తులు వేస్తోంది. ఒక వైపు చంద్రబాబును తిడుతూనే టీడీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా మైండ్ గేమ్ ఆడుతోంది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్ … చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీలో వెళ్లి పనిచేసుకోవాల్సిందిగా చంద్రబాబును తాను కోరితే ఆయన మాత్రం వదల బొమ్మాళీ వదల అన్నట్టు హైదరాబాద్‌ను పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ వదిలి వెళ్లాలని తామేమైనా అన్నామా అని ప్రశ్నించారు.

చంద్రబాబు హైదరాబాద్‌లో మరో 20 హెరిటేజ్ దుకాణాలు పెట్టుకుంటానంటే లైసెన్స్‌లు కూడా ఇప్పిస్తామన్నారు. ఏపీని పాలించమని అక్కడి ప్రజలు ఓటేస్తే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో ఉంటానంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వాస్తవాలు అర్థం కావడం లేదన్నారు. తాను కూడా చంద్రబాబులాగా అమరావతి, ముంబై వెళ్లి ఇక్కడే ఉంటానంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తనకు ఉండబుద్ది కావడం లేదని, హైదరాబాద్‌ నుంచి పాలించాలంటే విదేశాల నుంచి పాలించినట్టుగా ఉందని గతంలో చంద్రబాబు చేసిన కామెంట్స్‌ను కేసీఆర్ ప్రస్తావించారు. చంద్రబాబు కుటుంబసభ్యుల గురించి కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు దుకాణం పెట్టుకుంటానంటే లైసెన్సులు ఇప్పిస్తానని అన్నారు. భువనేశ్వరి వదిన చంద్రబాబు కన్నా ఎంతో నయమన్నారు. తమ పార్టీ వాళ్లు వెళ్లి ఓటు అడిగితే తప్పకుండా టీఆర్ఎస్‌కే వేస్తానని చెప్పారన్నారు. వదిన భువనేశ్వరి చాలా మంచిదని.. ఇక్కడే ఉండి వ్యాపారం చూసుకుంటున్నారని అన్నారు. వదినకు నిజాయితీ ఉందని గ్యారంటీగా టీఆర్‌ఎస్‌కే ఓటేస్తారని కేసీఆర్ చెప్పారు చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండడం లేదు కాబట్టి భువనేశ్వరి వదిన టీఆర్‌ఎస్‌కే ఓటేస్తున్న విషయం తెలియడం లేదన్నారు.

click on image to read:

ఉలిక్కిపడిన టీడీపీ- మెరుపు వేగంతో లోకేష్‌ ట్వీట్

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

బాలకృష్ణ ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత ఉందా?!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

kaapu-garjana-sabha

First Published:  30 Jan 2016 5:39 PM IST
Next Story