Telugu Global
Others

అమరావతి తొలి రెండు అంతస్తుల్లో నివాసం వద్దు- ఐరాస కన్సల్టెంట్

ఏపీ రాజధాని నిర్మాణంపై ఇప్పటికే పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నై వరదలు చూసిన తర్వాత ఆ భయం మరింత అధికమైంది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ కేవీపీ కూడా ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా ఐక్యరాజ్యసమితి కన్సల్టెంట్‌, ప్రఖ్యాత ఇంజనీర్‌ టి. హనుమంతరావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధానిని కట్టకూడని ప్రాంతంలో కడుతున్నారని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతికి వరద ముప్పు పొంచి ఉందన్నది […]

అమరావతి తొలి రెండు అంతస్తుల్లో నివాసం వద్దు- ఐరాస కన్సల్టెంట్
X

ఏపీ రాజధాని నిర్మాణంపై ఇప్పటికే పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నై వరదలు చూసిన తర్వాత ఆ భయం మరింత అధికమైంది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ కేవీపీ కూడా ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా ఐక్యరాజ్యసమితి కన్సల్టెంట్‌, ప్రఖ్యాత ఇంజనీర్‌ టి. హనుమంతరావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధానిని కట్టకూడని ప్రాంతంలో కడుతున్నారని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు.

అమరావతికి వరద ముప్పు పొంచి ఉందన్నది వాస్తవం అన్నారు. జాగ్రత్తగా వ్యవహరించకపోతే పెను ముప్పు తప్పదని హెచ్చరించారు. 2009లో కృష్ణా నదికి 24 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని గుర్తు చేశారు. అమరావతి వరదను మూడు కోణాల్లో చూడాల్సి ఉంటుందన్నారు. కృష్ణానది వరద, స్థానికంగా కురిసే వర్షం, అన్నింటి కంటే ముఖ్యంగా కొండవీటి వాగు వరదను పరిగణలోకి తీసుకోవాలన్నారు. అటు కృష్ణా, ఇటు కొండవీటి వాగు రెండూ ఒకేసారి పొంగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

2009లో కృష్ణానదికి 24 లక్షల క్యూసెక్కుల వరద రాగా… విజయవాడ వద్దకు అందులో సగం మాత్రమే చేరిందన్నారు. ఆ సమయంలోనూ అమరావతి ప్రాంతంలో 5 అడుగుల మేర నీరు చేరిందని టి. హనుమంతరావు చెప్పారు. గతంలో వందేళ్లకొకసారి భారీ వరద రికార్డ్ అయ్యేదని కానీ వాతావరణ పరిస్థితుల్లో మార్పు వల్ల ప్రస్తుతం ప్రతి 10-20 ఏళ్లకొకసారి రికార్డు స్థాయిలో వరద నమోదవుతోందని అన్నారు. ఈ విషయం ఐక్యరాజ్యసమితి పరిశోధనలో తేలిందన్నారు.

కృష్ణానదికి వరద వస్తే అమరావతి పరిధిలో ఏ ప్రాంతంలో ఎంతమేర నీరు నిలబడుతుందో సర్వే చేయించి ఆ తర్వాతే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని టీ. హనుమంతరావు సూచించారు. చెన్నైలో 490 మి.మి వర్షం కురిసిందని ఆ స్థాయిలో అమరావతిలో వర్షం వస్తే పరిస్థితిని ఊహించలేమన్నారు టి. హనుమంతరావు. అమరావతిలో నిర్మించే భవనాల్లో కింది రెండు అంతస్తులు(కనీసం 20 అడుగులు) నివాసానికి ఉపయోగించకుండా ఇతర అవసరాలకు వినియోగించడం మంచిదని సలహా ఇచ్చారు.

Click on image to Read

బాబు డాక్టర్ కాలేరా?.. అసలు సలహా ఇచ్చింది ఎవరు?

ఇంకో వంద కేసులు పెట్టుకోండి….

jana-reddy-lunch

ycp-jammalamadugu

venkayya-naidu-new

మోదీ కుండలు చూసే నోరు మూసుకున్నా…

ఆ నిజాలు నాతోనే సమాధి అవుతాయి

kcr-pressmeet

First Published:  29 Jan 2016 6:23 AM IST
Next Story