ఎన్జీవో సంస్థ పేరుతో కిలాడి లేడి కంపెనీ
వ్యభిచారం పేరుతో బ్లాక్‌మెయిల్ దందా నడిపేందుకు ప్రయత్నించిన ఒక మహిళను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వ్యభిచారం చేస్తానని నమ్మించి విటుల కొంపకొల్లేరు చేసినట్టు గుర్తించారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన 26ఏళ్ల నయిదా 15 రోజుల క్రితం తవ్వాకల్ ఓల్డేజ్ హోమ్ పేరుతో ఫేక్ ఎన్‌జీవో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు తన సోదరుడి […]
వ్యభిచారం పేరుతో బ్లాక్‌మెయిల్ దందా నడిపేందుకు ప్రయత్నించిన ఒక మహిళను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వ్యభిచారం చేస్తానని నమ్మించి విటుల కొంపకొల్లేరు చేసినట్టు గుర్తించారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన 26ఏళ్ల నయిదా 15 రోజుల క్రితం తవ్వాకల్ ఓల్డేజ్ హోమ్ పేరుతో ఫేక్ ఎన్‌జీవో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు తన సోదరుడి సాయం తీసుకుంది.
ముందస్తు ప్లాన్ ప్రకారం యాకుత్‌పురాలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సబాను నయిదా సంప్రదించింది. తాను ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నానని వ్యభిచారం చేస్తానని అవకాశం ఇవ్వాలని కోరింది. దీంతో జహీర్ అనే విటుడిని పిలిపించిన సబా… అనంతరం నయిదాకు సమాచారం అందించింది. అనుకున్నట్టుగానే వచ్చిన నయిదా విటుడితో కలిసి సబా ఇంటిలోకి వెళ్లింది. అనంతరం విటుడిని గదిలో పెట్టి వ్యభిచారం జరుగుతోందంటూ కేకలు వేయడం ప్రారంభించింది.ఇంతలోనే ముందస్తు ప్లాన్ ప్రకారం నయిదా సోదరుడు కూడా అక్కడికి వచ్చారు. ఇద్దరూ కలిసి విటుడు జహీర్, వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సబాను బ్లాక్ మెయిల్ చేశారు. తాను ఎన్‌జీవో సంస్థను నిర్వహిస్తున్నానని వ్యభిచార ముఠాల గుట్టు రట్టు చేయడమే తమ పని అని బెదిరించింది.
డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు సమాచారం అందిస్తామని నయిదా, ఆమె సోదరుడు బ్లాక్ మెయిల్ చేశారు. అలా విటుడి నుంచి రూ. 10 వేలు, రూ. 20 విలువ చేసే సెల్‌ఫోన్ లాక్కున్నారు. సబా వద్దనున్న బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను తీసుకున్నారు. మరో రూ. 50 వేలు ఇవ్వాలని లేకపోతే కేసు నమోదు చేయిస్తానని బెదిరించారు. అయితే సబా జరిగిన సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నయిదా ప్లాన్ బెడిసికొట్టింది. నయిదా,ఆమె సోదరుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నయిదా, ఆమె సోదరుడు సోహేల్, జహీర్‌లను అరెస్ట్ చేశారు. నయిదా మాజీ రౌడీషీటర్ అక్బర్ కూతురని, జనాన్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు లాగేందుకే ఎన్‌జీవో కంపెనీ ఏర్పాటు చేసిందని పోలీసులు చెబుతున్నారు.