బాబా పంటి తెలుపుకు కోల్ గేట్ గావుకేక
పతంజలి అంటే ఇప్పటివరకు మనకు గుర్తొచ్చేది యోగానే. కానీ రామ్‌దేవ్ బాబా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాక వాణిజ్యరంగంలోనూ పతంజలి పేరు విస్తృతంగా వినబడుతోంది. నిన్న నూడుల్స్‌తో స్విస్ మల్టీనేషనల్ దిగ్గజం నెస్ట్లేకి పోటీనిచ్చిన యోగా గురు రాందేవ్ బాబా ఇప్పుడు మరో ఎమ్ఎన్‌సి కంపెనీ కోల్గేట్ పామోలివ్ వ్యాపార సామ్రాజ్యంలో పాగా వేసేందుకు సిద్దమవుతున్నారు. కోల్‌గేట్ కంటే మన స్వదేశీ ఉత్పత్తులే పళ్లను మెరిపిస్తాయని చెబుతున్నారు. రాందేవ్ బాబా నిర్వహిస్తున్న పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ ఇప్పుడు పళ్లపొడులు, పేస్టుల ఉత్పత్తుల మార్కెట్‌షేర్‌లో 4.5శాతాన్ని ఆక్రమించింది. […]
పతంజలి అంటే ఇప్పటివరకు మనకు గుర్తొచ్చేది యోగానే. కానీ రామ్‌దేవ్ బాబా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాక వాణిజ్యరంగంలోనూ పతంజలి పేరు విస్తృతంగా వినబడుతోంది. నిన్న నూడుల్స్‌తో స్విస్ మల్టీనేషనల్ దిగ్గజం నెస్ట్లేకి పోటీనిచ్చిన యోగా గురు రాందేవ్ బాబా ఇప్పుడు మరో ఎమ్ఎన్‌సి కంపెనీ కోల్గేట్ పామోలివ్ వ్యాపార సామ్రాజ్యంలో పాగా వేసేందుకు సిద్దమవుతున్నారు. కోల్‌గేట్ కంటే మన స్వదేశీ ఉత్పత్తులే పళ్లను మెరిపిస్తాయని చెబుతున్నారు.
రాందేవ్ బాబా నిర్వహిస్తున్న పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ ఇప్పుడు పళ్లపొడులు, పేస్టుల ఉత్పత్తుల మార్కెట్‌షేర్‌లో 4.5శాతాన్ని ఆక్రమించింది. కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఇప్పటివరకు పళ్ల పొడులు, పేస్టుల రంగాన్ని ఏలుతున్న కోల్‌గేట్, గత ఏడాది తన మార్కెట్ షేర్‌లో 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక పర్సంటేజి పాయింట్) కోల్పోయింది.
మరింతగా పళ్ల శుభ్రత ఉత్పత్తుల రంగాన్ని ఆక్రమించే ధ్యేయంతో రామ్‌దేవ్‌బాబా ముందుడుగులు వేస్తున్నారు. వారి సంస్థ నుండి వస్తున్న దంతకాంతి పళ్ల శుభ్రత ఉత్పత్తుల బ్రాండ్ నుండి ఇకపై మెడికేటెడ్, అడ్వాన్స్, జూనియర్ అనే సరికొత్త రకాలను తేనున్నారు. కోల్‌గేట్‌కి పతంజలి గట్టి పోటీనే ఇస్తుందని పలు బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో కోల్‌గేట్ ఉత్పత్తుల నుండి ఆ సంస్థ ఆర్జిస్తున్న మొత్తంలో నాలుగునుండి 10శాతం తగ్గుదల ఉంటుందనేది ఒక బ్రోకరేజి హౌస్ విశ్లేషణ. పళ్లపొడులు, నూడుల్స్ మీదే కాదు, రాందేవ్ బాబా సంస్థ మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలను టార్గెట్ చేస్తూ త్వరలో హెల్త్ కేర్ ఐటమ్స్, ఫుడ్, డ్రింకులను, పిల్లలకోసం వాడే ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేవాలనుకుంటోంది. పంతజలి సంస్థ నుండి వచ్చే పవర్ వీటా, మాండలేజ్, జిఎస్‌కె కంజూమర్ లాంటి కంపెనీల ఉత్పత్తులను ధీటుగా ఎదుర్కొంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.