కేటీఆర్‌తో రాజేంద్రప్రసాద్ భేటీ వెనుక !
సినీనటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్… శుక్రవారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. చాలా సేపు వారిద్దరు మాట్లాడుకున్నారు. గ్రేటర్ ఎన్నికల వేళ వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాజేంద్రప్రసాద్ మాత్రం కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను వివరించేందుకే కేటీఆర్‌ను కలిశానని చెబుతున్నా… భేటీ వెనుక ఇతర కారణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ”మా” అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ ఎంపీ మురళీ మోహన్ వర్గంతో రాజేంద్రప్రసాద్ నేరుగా ఢీకొన్నారు. ఆసమయంలో రాజేంద్రప్రసాద్‌పై […]
సినీనటుడు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్… శుక్రవారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. చాలా సేపు వారిద్దరు మాట్లాడుకున్నారు. గ్రేటర్ ఎన్నికల వేళ వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాజేంద్రప్రసాద్ మాత్రం కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను వివరించేందుకే కేటీఆర్‌ను కలిశానని చెబుతున్నా… భేటీ వెనుక ఇతర కారణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ”మా” అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ ఎంపీ మురళీ మోహన్ వర్గంతో రాజేంద్రప్రసాద్ నేరుగా ఢీకొన్నారు. ఆసమయంలో రాజేంద్రప్రసాద్‌పై మురళీమోహన్ వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది.
రాజేంద్రప్రసాద్‌కు అంత స్టేచర్ లేదని కూడా మురళీ మోహన్ వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చాయి. అయితే మురళీమోహన్ వర్గం నుంచి పోటీ చేసిన జయసుధపై విజయం సాధించిన అనంతరం రాజేంద్రప్రసాద్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. సినిమా వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ .. కేటీఆర్‌ను కలవడం వల్ల సీమాంధ్ర ఓటర్లకు టీఆర్‌ఎస్ పట్ల సానుకూల సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. అయితే రాజేంద్రప్రసాద్ టీఆర్ఎస్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతారా లేదా అన్నది చూడాలి.
ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తమ మద్దతు ఉంటుందని తెలుగుచలనచిత్ర పరిశ్రమ కార్మిక సమాఖ్య గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికల వేళ సినిమా వాళ్ల మద్దతు కోసం టీఆర్‌ఎస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.