Telugu Global
Others

భోజనం చేసి బుక్ అయిన జానారెడ్డి

సీఎల్పీ నేత జానారెడ్డి మరోసారి సొంతపార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అది కూడా భోజనం చేసి. గురువారం విలేకర్లు సమావేశం నిర్వహించిన జానారెడ్డికి ఉన్నట్టుండి భోజనంపైకి మనసు మళ్లింది. అంతే వెంటనే సిబ్బందిని పిలిచి భోజనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అది కూడా గ్రేటర్‌ పరిధిలో అమలవుతున్న ఐదు రూపాయల భోజనం తీసుకురావాలని సూచించారు. వారు తెచ్చారు. జానారెడ్డితో పాటు విలేకర్లు తిన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ జానారెడ్డి విలేకర్ల వద్ద 5 రూపాయల భోజనం […]

భోజనం చేసి బుక్ అయిన జానారెడ్డి
X

సీఎల్పీ నేత జానారెడ్డి మరోసారి సొంతపార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అది కూడా భోజనం చేసి. గురువారం విలేకర్లు సమావేశం నిర్వహించిన జానారెడ్డికి ఉన్నట్టుండి భోజనంపైకి మనసు మళ్లింది. అంతే వెంటనే సిబ్బందిని పిలిచి భోజనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అది కూడా గ్రేటర్‌ పరిధిలో అమలవుతున్న ఐదు రూపాయల భోజనం తీసుకురావాలని సూచించారు. వారు తెచ్చారు. జానారెడ్డితో పాటు విలేకర్లు తిన్నారు. అంతవరకు బాగానే ఉంది.

కానీ జానారెడ్డి విలేకర్ల వద్ద 5 రూపాయల భోజనం పథకంపై ప్రశంసలు కురిపించారు. భోజనం అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. పథకాన్ని బాగా అమలు చేస్తున్నారంటూ మెచ్చుకున్నారు. గ్రేటర్‌ ఎన్నికల వేళ, కాంగ్రెస్ శ్రేణులు చావోరేవో అన్నట్టు పోరాడుతున్న వేళ ప్రభుత్వ పథకాన్ని జానారెడ్డి ప్రశంసించే సరికి కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు ఐదు రూపాయల భోజనం పథకాన్ని బాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమయంలో జానారెడ్డి కూడా స్వయంగా అదే భోజనం చేసి పథకం సూపర్ అంటూ పొగడ్తలు కురిపించడంతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.

జానారెడ్డి తీరు తొలి నుంచి కూడా ఇలాగే ఉందని మండిపడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగో ముందుండి శ్రేణులను నడిపించడం లేదు… కానీ పోరాడుతున్న వారి ఉత్సాహంపై ఇలా నీళ్లు చల్లడం ఏమిటని పశ్నిస్తున్నారు. అయితే ఈ సమయంలో రూ. 5 భోజనం చేయాలని ఎందుకనిపించిందని విలేకర్లు ప్రశ్నిస్తే జానారెడ్డి నేరుగా సమాధానం చెప్పలేదు. ఇది కాంగ్రెస్ పెట్టిన పథకం అని చెప్పారు. మొత్తం మీద జానారెడ్డి సొంతపార్టీపై లంచ్‌తో పంచ్ విసిరినట్టైంది.

Click on image to Read

అమరావతి తొలి రెండు అంతస్తుల్లో నివాసం వద్దు- ఐరాస కన్సల్టెంట్

ycp-jammalamadugu

venkayya-naidu-new

మోదీ కుండలు చూసే నోరు మూసుకున్నా…

ఆ నిజాలు నాతోనే సమాధి అవుతాయి

బాబునే ఉరికించాం.. నీవెంత.. తొక్కేస్తాం: కేటీఆర్‌

kcr-pressmeet

lokesh-anasuya

First Published:  29 Jan 2016 5:45 AM IST
Next Story