Telugu Global
Others

బాబు డాక్టర్ కాలేరా?.. అసలు సలహా ఇచ్చింది ఎవరు?

చికాగో స్టేట్ యూనివర్శిటీ టీడీపీకి చికాకు తెప్పిస్తోంది. చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్నట్టు వర్శిటీ ప్రకటించడంతో రాష్ట్రంలో దాని పేరు మార్మోగింది. అమెరికాలోనే ప్రఖ్యాతిగాంచిన యూనివర్శిటీ చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తోందంటూ ప్రచారం జరిగింది. టీడీపీ శ్రేణులు సంబరపడ్డాయి. కానీ ఆ ఆనందం ఒక్కరోజే మిగిలింది. అమెరికాలో ఉన్న కొందరు ఎన్‌ఆర్‌ఐలు వర్శిటీ అసలు సంగతిని వెలుగులోకి తెచ్చారు. అమెరికాలో చికాగో యూనివర్శిటీ, చికాగో స్టేట్ యూనివర్శిటీ అని రెండు ఉన్నాయి. చికాగో యూనివర్శిటీ అమెరికాలోని వర్శిటీల్లో టాప్ 10లో […]

బాబు డాక్టర్ కాలేరా?.. అసలు సలహా ఇచ్చింది ఎవరు?
X

చికాగో స్టేట్ యూనివర్శిటీ టీడీపీకి చికాకు తెప్పిస్తోంది. చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్నట్టు వర్శిటీ ప్రకటించడంతో రాష్ట్రంలో దాని పేరు మార్మోగింది. అమెరికాలోనే ప్రఖ్యాతిగాంచిన యూనివర్శిటీ చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తోందంటూ ప్రచారం జరిగింది. టీడీపీ శ్రేణులు సంబరపడ్డాయి. కానీ ఆ ఆనందం ఒక్కరోజే మిగిలింది. అమెరికాలో ఉన్న కొందరు ఎన్‌ఆర్‌ఐలు వర్శిటీ అసలు సంగతిని వెలుగులోకి తెచ్చారు. అమెరికాలో చికాగో యూనివర్శిటీ, చికాగో స్టేట్ యూనివర్శిటీ అని రెండు ఉన్నాయి. చికాగో యూనివర్శిటీ అమెరికాలోని వర్శిటీల్లో టాప్ 10లో ఉంటుంది. చికాగో స్టేట్ యూనివర్శిటీ మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత లేని వర్శిటీ. దాని పేరు కూడా అక్కడ పెద్దగా తెలియదు. అయితే టీడీపీ నేతలు చంద్రబాబుకు చికాగో యూనివర్శిటీ డాక్టరేట్ ఇస్తోందని(లోకేష్ తన ట్విట్టర్‌లోనూ అలాగే రాశారు) ప్రచారం చేశారు. అయితే అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు అసలు విషయం ఏపీలోని మీడియా సంస్థలకు చేరవేశారు. దీంతో చంద్రబాబు డాక్టరేట్ వ్యవహారం నవ్వుల పాలైంది.

అయినా సరే డాక్టరేట్ ఇస్తున్నది అమెరికా యూనివర్శిటీ కదా అని సర్దుకుపోయారు. అయితే లేటెస్ట్‌గా చంద్రబాబు డాక్టరేట్‌కు అసలు గండం తయారైంది. డాక్టరేట్ ఇస్తామంటూ ప్రకటించిన చికాగో స్టేట్ యూనివర్శిటీ దివాలా దిశగా ప్రయాణం సాగిస్తోంది. కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న యూనివర్శిటీ ప్రతి ఏటా స్టేట్ ఫండింగ్‌పై ఆధారపడుతూ మూలుగుతూ ముక్కుతూ నెట్టుకొచ్చింది. అయితే ఇప్పుడా ఆ నిధులు కూడా నిలిచిపోయాయి. వర్శిటీలో అవకతవకల కారణంగానే నిధులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ చదువుతున్న విద్యార్థులు సైతం దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు డాక్టరేట్‌ ప్రదానం కూడా చిక్కుల్లో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్శిటీ డాక్టరేట్లు ప్రదానం చేసే అవకాశం లేదంటున్నారు.

చంద్రబాబు కూడా డాక్టరేట్ తీసుకునే విషయంలో పునరాలోచనలో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చెత్త యూనివర్శిటీ అని తెలిసిన తర్వాత కూడా డాక్టరేట్ తీసుకుంటే జీవితాంతం నెగిటివ్‌గానే ప్రచారం సాగుతుందని భావిస్తున్నారట. యూనివర్శిటీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కినా డాక్టరేట్ తీసుకోకపోవడమే బెటర్ అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసలు చంద్రబాబుకు సదరు యూనివర్శిటీలో డాక్టరేట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసిందెవరన్న దానిపై టీడీపీ నేతలు ఆరా తీసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యూనివర్శిటీలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ టీడీపీ నేతకు సన్నిహితుడు కావడం వల్లే డాక్టరేట్ తెరపైకి వచ్చింది.

నిధుల కొరత ఉన్నప్పటికీ 2016 మార్చి నాటికి సెమిస్టర్ పూర్తి చేస్తామని వర్సిటీ చెబుతోంది.. నిధుల కోసం లామేకర్స్ , ప్రభుత్వ అధికారుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నామని యూనివర్సిటీ ప్రెసిడెంట్ థామస్ జె. కల్హాన్ ప్రకటించారు. చూడాలి ఏం జరుగుతుందో!.

Click on image to read:

ఇంకో వంద కేసులు పెట్టుకోండి….

బిత్తరపోయిన బీజేపీ నేతలు

jana-reddy-lunch

మోదీ కుండలు చూసే నోరు మూసుకున్నా…

ఆ నిజాలు నాతోనే సమాధి అవుతాయి

బాబునే ఉరికించాం.. నీవెంత.. తొక్కేస్తాం: కేటీఆర్‌

kcr-pressmeet

lokesh-anasuya

First Published:  29 Jan 2016 10:59 AM GMT
Next Story