Telugu Global
Others

బిత్తరపోయిన బీజేపీ నేతలు

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీరు ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలకు వెంకయ్య తీరు అంతుచిక్కడం లేదు. తెలంగాణలో పార్టీని ఉంచాలనుకుంటున్నారా లేక ముంచాలనుకుంటున్నారా అని అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఇలా రగిలిపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌తో బీజేపీ నేతలు చెమటోడ్చి పోరాడుతున్న వేళ స్మార్ట్ సిటీలపై వెంకయ్య ప్రకటన లోకల్ లీడర్లకు చెమటలు పట్టించింది. వరంగల్ ఉప ఎన్నిక నాటి సంఘటన కూడా వారు […]

బిత్తరపోయిన బీజేపీ నేతలు
X

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీరు ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలకు వెంకయ్య తీరు అంతుచిక్కడం లేదు. తెలంగాణలో పార్టీని ఉంచాలనుకుంటున్నారా లేక ముంచాలనుకుంటున్నారా అని అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఇలా రగిలిపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌తో బీజేపీ నేతలు చెమటోడ్చి పోరాడుతున్న వేళ స్మార్ట్ సిటీలపై వెంకయ్య ప్రకటన లోకల్ లీడర్లకు చెమటలు పట్టించింది. వరంగల్ ఉప ఎన్నిక నాటి సంఘటన కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు.

గురువారం నాడు స్మార్ట్ సిటీలపై ప్రకటన చేసిన వెంకయ్యనాయుడు ఏపీ నుంచి కాకినాడ, విశాఖ స్మార్ట్ సిటీలుగా ఎంపికైనట్టు ప్రకటించారు. కానీ తెలంగాణ నుంచి ఒక్క పట్టణాన్ని కూడా స్మార్ట్ సిటీగా ఎంపిక చేయలేదు. ఈ ప్రకటన తెలంగాణవారు నొచ్చుకునేలా చేసింది. పైగా ఒక్క పాయింట్‌ తేడాతో వరంగల్ స్మార్ట్ సిటీ కాలేకపోయిందంటూ పుండుమీద కారం చల్లారు. తెలంగాణవారి సంగతేమో గాని ఇప్పుడు గ్రేటర్‌లో బీజేపీ నేతల స్థితి సంకటంలో పడింది. తెలంగాణవారి దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లి ఓట్లు అడగాలని ప్రశ్నిస్తున్నారు.

స్మార్ట్ సిటీలపై ప్రకటన మరో వారం రోజుల వాయిదా వేసి ఉంటే కొంపలు మునిగేవా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ బీజేపీ నేతలు మరో అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే వెంకయ్యనాయుడు వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్‌కు కేవలం మూడు రోజుల ముందు ఇళ్ల మంజూరుపై ప్రకటన చేశారు. ఏపీలో లక్షా 93 వేల ఇళ్లు ప్రకటించిన వెంకయ్య నాయుడి శాఖ… తెలంగాణకు మాత్రం కేవలం పది వేల ఇళ్లు కేటాయించింది.( అనంతరం కేసీఆర్ నేరుగా వెళ్లి కలవడంతో మరో 45 వేల ఇళ్లు ప్రకటించింది కేంద్రం). దీంతో ఆఖరి రోజుల్లో ప్రచారానికి వెళ్లాలంటేనే బీజేపీ నేతలు దడుసుకున్నారు. అనుకున్నట్టుగానే బీజేపీ అభ్యర్ధికి వరంగల్ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా రాలేదు. మరీ వెంకయ్య లేటెస్ట్ స్మార్ట్ సిటీల దెబ్బకు గ్రేటర్‌లో బీజేపీ ఎలాంటి ఫలితాన్ని రుచి చూస్తుందో చూడాలి.

Click on Image to Read:

బాబు డాక్టర్ కాలేరా?.. అసలు సలహా ఇచ్చింది ఎవరు?

ఇంకో వంద కేసులు పెట్టుకోండి….

అమరావతి తొలి రెండు అంతస్తుల్లో నివాసం వద్దు- ఐరాస కన్సల్టెంట్

ycp-jammalamadugu

jana-reddy-lunch

మోదీ కుండలు చూసే నోరు మూసుకున్నా…

ఆ నిజాలు నాతోనే సమాధి అవుతాయి

బాబునే ఉరికించాం.. నీవెంత.. తొక్కేస్తాం: కేటీఆర్‌

kcr-pressmeet

lokesh-anasuya

First Published:  28 Jan 2016 10:56 PM GMT
Next Story