పవన్‌కు అందిన క్యాష్
పవన్ కల్యాణ్ అంతే. ఆ సమయానికే కోపం. మళ్లీ మరుక్షణం శాంతం. తాజాగా ఈ విషయం మరోసారి రుజవైంది. అత్తారింటికి దారేది సినిమా సమయంలో తనకు ఇస్తానన్న 2 కోట్ల రూపాయల్ని ఇవ్వలేదనే ఆరోపణలో… నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ పై పవన్ మా..లో ఫిర్యాదు చేశాడు. ఎన్టీఆర్ చేసిన నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ముందే డబ్బు చెల్లిస్తానని చెప్పిన నిర్మాత ప్రసాదు… మాటతప్పడం వల్లనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పవన్ పేర్కొన్నాడు. అయితే పవన్ కు మాటిచ్చిన […]
BY admin27 Jan 2016 7:08 PM IST

X
admin Updated On: 28 Jan 2016 5:56 AM IST
పవన్ కల్యాణ్ అంతే. ఆ సమయానికే కోపం. మళ్లీ మరుక్షణం శాంతం. తాజాగా ఈ విషయం మరోసారి రుజవైంది. అత్తారింటికి దారేది సినిమా సమయంలో తనకు ఇస్తానన్న 2 కోట్ల రూపాయల్ని ఇవ్వలేదనే ఆరోపణలో… నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ పై పవన్ మా..లో ఫిర్యాదు చేశాడు. ఎన్టీఆర్ చేసిన నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ముందే డబ్బు చెల్లిస్తానని చెప్పిన నిర్మాత ప్రసాదు… మాటతప్పడం వల్లనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పవన్ పేర్కొన్నాడు. అయితే పవన్ కు మాటిచ్చిన మాట వాస్తవమేనని నిర్మాత కూడా ఒప్పుకున్నాడు. కొన్ని రోజులు ఆలస్యమైందని, డబ్బు ఎగ్గొట్టి పారిపోయే రకం కాదని స్పష్టంచేశాడు. మరీ ముఖ్యంగా పవన్ లాంటి హీరోకు వ్యతిరేకంగా పనిచేసేంత గట్స్ తనకు లేవని కూడా చెప్పుకొచ్చాడు. చెప్పిన మాట ప్రకారం… కాస్త ఆలస్యమైనప్పటికీ… 2కోట్ల రూపాయల్ని పువ్వుల్లో పెట్టి పవర్ స్టార్ కు సమర్పించినట్టు తెలుస్తోంది.
Next Story