Telugu Global
Others

గ్రేటర్‌ బరిలో నేరస్తులు- ఆ పార్టీయే టాప్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీగానే నేరస్తులు పోటీలో నిలబడ్డారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరస్తుల జాబితాను ఫోరం ఫర్ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ విడుదల చేసింది. మొత్తం 72 మంది నేరస్తులు బరిలో దిగారు. టీడీపీ నుంచే ఎక్కువ మంది నేరస్తున్నారు.72మందిలో 64 మంది పురుషులు కాగా… ఎనిమిది మంది మహిళా నేరస్తులున్నారు. పార్టీల వారీగా చూస్తే టీఆర్ఎస్ నుంచి 14( మొత్తం 150 అభ్యర్థుల్లో) మంది నేరస్తులు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 13 మంది( […]

గ్రేటర్‌ బరిలో నేరస్తులు- ఆ పార్టీయే టాప్
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీగానే నేరస్తులు పోటీలో నిలబడ్డారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరస్తుల జాబితాను ఫోరం ఫర్ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ విడుదల చేసింది. మొత్తం 72 మంది నేరస్తులు బరిలో దిగారు. టీడీపీ నుంచే ఎక్కువ మంది నేరస్తున్నారు.72మందిలో 64 మంది పురుషులు కాగా… ఎనిమిది మంది మహిళా నేరస్తులున్నారు. పార్టీల వారీగా చూస్తే టీఆర్ఎస్ నుంచి 14( మొత్తం 150 అభ్యర్థుల్లో) మంది నేరస్తులు పోటీలో ఉన్నారు.

టీడీపీ నుంచి 13 మంది( టీడీపీ మొత్తం పోటీ చేస్తున్న స్థానాలు 87 మాత్రమే) , కాంగ్రెస్ నుంచి 13 మంది నేరస్తులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి 4, ఎంఐఎం నుంచి 11 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. 11 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులపైనా క్రిమినల్ కేసులున్నట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించింది. సీపీఎం, సీపీఐ నుంచి కూడా ఒక్కో నేరస్తుడు పోటీ చేస్తున్నారు. శాతం వారీగా చూస్తే టీడీపీ మొత్తం అభ్యర్థుల్లో 15 శాతం మంది, టీఆర్ఎస్ నుంచి 9 శాతం మంది నేరచరితులు బరిలో ఉన్నారు.

First Published:  28 Jan 2016 8:02 AM IST
Next Story