లోకేష్‌ను అనసూయ అలా అనుకుందట!
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేటీఆర్, లోకేష్‌లు ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. తొలుత నారా లోకేష్ ఒక ట్వీట్‌ను కేటీఆర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశారు. తాను గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా అనసూయ అనే మహిళ కారుకు అడ్డుగా వచ్చిందని… తనను కేటీఆర్‌గా భావించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరిందని ట్వీట్‌లో లోకేష్ వెల్లడించారు. సదరు మహిళ ఫోటోను కూడా కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్‌కు […]
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేటీఆర్, లోకేష్‌లు ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. తొలుత నారా లోకేష్ ఒక ట్వీట్‌ను కేటీఆర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశారు. తాను గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా అనసూయ అనే మహిళ కారుకు అడ్డుగా వచ్చిందని… తనను కేటీఆర్‌గా భావించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరిందని ట్వీట్‌లో లోకేష్ వెల్లడించారు. సదరు మహిళ ఫోటోను కూడా కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్‌కు లోకేష్ ట్యాగ్ చేశారు. పరోక్షంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూం పథకం అమలు కావడం లేదని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.
లోకేష్ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. లాజిక్‌తో రీట్వీట్ చేశారు. ఇప్పటికైనా అర్థమైందా… అధికారంలో ఉన్న తామే డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇవ్వగలమని జనం భావిస్తున్నారని అంటూ కేటీఆర్ బదులు చెప్పారు. ఈ విషయం గుర్తించినందుకు లోకేష్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు . అనసూయలాంటి వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న లోకేష్‌కు కేటీఆర్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.
@KTRTRS Anasuya mistook me for you & fell in front of my vehicle in the tour as she has no other way of reaching you pic.twitter.com/KDWiOitOsV
— Lokesh Nara (@naralokesh) January 28, 2016
Brother, Glad she understands that it is the state Govt and party in power that can make it happen.Will take care1/2 https://t.co/00pW9Rfcvo
— KTR (@KTRTRS) January 28, 2016
Click on Image to Read: