Telugu Global
NEWS

మోదీ కుండలు చూసే నోరు మూసుకున్నా...

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ నేతలు ప్రచారం చేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అమరావతికే దిక్కులేదు. ఇక హైదరాబాద్‌కు నిధులెక్కడి నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తారని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన రోజు జరిగిన సంఘటనను కేసీఆర్ గుర్తు చేశారు. కొత్తగా కడుతున్న రాజధానికి తెలంగాణ ప్రభుత్వం తరపున విరాళం ప్రకటించాలనుకునే  శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లానని చెప్పారు. అయితే అక్కడి పరిస్థితి చూసిన […]

మోదీ కుండలు చూసే నోరు మూసుకున్నా...
X

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ నేతలు ప్రచారం చేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అమరావతికే దిక్కులేదు. ఇక హైదరాబాద్‌కు నిధులెక్కడి నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తారని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన రోజు జరిగిన సంఘటనను కేసీఆర్ గుర్తు చేశారు.

కొత్తగా కడుతున్న రాజధానికి తెలంగాణ ప్రభుత్వం తరపున విరాళం ప్రకటించాలనుకునే శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లానని చెప్పారు. అయితే అక్కడి పరిస్థితి చూసిన తర్వాత వెనక్కు తగ్గానని చెప్పారు. వేదిక మీద ఉండగా ప్రధాని మోదీ రెండు కుండలు తెచ్చి టీపాయ్‌ మీద పెట్టారని గుర్తు చేశారు. కుండలు చూసి తొలుత తాను పరేషాన్ అయ్యానన్నారు. పక్కనే ఉన్న వెంకయ్యనాయుడును కుండల్లో ఏముందని తాను అడిగానన్నారు. అప్పుడు కుండల్లో మట్టి నీరు ఉందని వెంకయ్య చెప్పారట. రాజధానికి సాయంపై ప్రధాని ప్రకటన చేయరని వెంకయ్య చెప్పారట.

ప్రధానే ప్రకటన చేయనప్పుడు తాను అమరావతి కోసం విరాళం ప్రకటిస్తే ”బిడ్డా నా కన్నా గొప్పొడివయ్యావా” అని ప్రధాని ఎక్కడ బాధపడుతారోనని నోరు మూసుకుని వెనక్కు వచ్చానన్నారు కేసీఆర్. ఈ విషయాన్ని ఆరోజే చంద్రబాబు, యనమల రామకృష్ణుడికి చెప్పానని వారు కూడా నవ్వుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. అలా అమరావతికే నిధులు తెచ్చుకోలేని వారు కేంద్రం నుంచి హైదరాబాద్‌ కోసం ఏం నిధులు తెస్తారని కేసీఆర్‌ ప్రశ్నించారు.

First Published:  28 Jan 2016 4:34 PM IST
Next Story