Telugu Global
Others

నేను, కేసీఆర్ రాజకీయ విరోధులమే

గ్రేటర్ ఎన్నికల ప్రచార బరిలోకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిగారు. పటాన్‌చెరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. జంటనగరాలను అభివృద్ధి చేసేందుకు నిజాంకు 400 ఏళ్లు, ఆంగ్లేయులకు వందేళ్లు పట్టిందని తాను తొమ్మిదేళ్ల పాలనలోనే అంత అభివృద్ధి చేసి చూపించానన్నారు. హైటెక్ సిటీ నిర్మాణంలో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయన్నారు. రైతు బిడ్డలు పొలాలు వదిలి సాప్ట్‌వేర్ బాట పట్టేలా చేసిన ఘనత తమదేనన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యం అవుతోందో […]

నేను, కేసీఆర్ రాజకీయ విరోధులమే
X

గ్రేటర్ ఎన్నికల ప్రచార బరిలోకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిగారు. పటాన్‌చెరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. జంటనగరాలను అభివృద్ధి చేసేందుకు నిజాంకు 400 ఏళ్లు, ఆంగ్లేయులకు వందేళ్లు పట్టిందని తాను తొమ్మిదేళ్ల పాలనలోనే అంత అభివృద్ధి చేసి చూపించానన్నారు. హైటెక్ సిటీ నిర్మాణంలో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయన్నారు. రైతు బిడ్డలు పొలాలు వదిలి సాప్ట్‌వేర్ బాట పట్టేలా చేసిన ఘనత తమదేనన్నారు.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యం అవుతోందో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మూడేళ్లలోనే మెట్రో నిర్మాణం పూర్తయ్యేదని చంద్రబాబు చెప్పారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణపై మాట్లాడే హక్కు కూడా తనకుందన్నారు. తాను ఎవ్వరికీ భయడపడే వాడిని కాదన్నారు. టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అన్నారు. ప్రభుత్వాల పరంగా కేసీఆర్, తాను సహకరించుకుంటున్నప్పటికీ…రాజకీయంగా మాత్రం విరోధులమేనన్నారు. రెండు రాష్ట్రాల్లో తెలుగువారికి ఎక్కడ ఇబ్బంది ఎదురైతే అక్కడ తాను వాలిపోతానని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు ఓటర్లను కోరారు.

Click on Image to Read

kcr-pressmeet

passport-issue-new

First Published:  28 Jan 2016 12:05 PM IST
Next Story