కూర్చుని... చర్చించుకొని.... పరిష్కరించుకున్నారు
సంక్రాంతికి బాక్సాబాస్ బరిలో ఎంత గందరగోళం జరిగిందో అందరం చూశాం. ఎన్టీఆర్, బాలయ్య, నాగార్జున, శర్వానంద్ సినిమాలు ఒకేసారి కట్టకట్టుకొని థియేటర్లలోకి వచ్చేశాయి. ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య గ్యాప్ కేవలం కొన్ని గంటలు మాత్రమే. అల్టిమేట్ గా కొన్ని సినిమాలు హిట్టయినప్పటికీ…. ఓవరాల్ గా అన్ని సినిమాలు కొంత వసూళ్లు కోల్పోయాయి అనేది పచ్చి నిజం. మళ్లీ అలాంటి సీనే వచ్చే నెల రిపీట్ అవ్వబోతోంది. కానీ ఈసారి హీరోలు మేల్కొన్నారు. ఎలాంటి బేషజాలు, […]
BY sarvi27 Jan 2016 12:33 AM IST
X
sarvi Updated On: 27 Jan 2016 6:21 AM IST
సంక్రాంతికి బాక్సాబాస్ బరిలో ఎంత గందరగోళం జరిగిందో అందరం చూశాం. ఎన్టీఆర్, బాలయ్య, నాగార్జున, శర్వానంద్ సినిమాలు ఒకేసారి కట్టకట్టుకొని థియేటర్లలోకి వచ్చేశాయి. ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య గ్యాప్ కేవలం కొన్ని గంటలు మాత్రమే. అల్టిమేట్ గా కొన్ని సినిమాలు హిట్టయినప్పటికీ…. ఓవరాల్ గా అన్ని సినిమాలు కొంత వసూళ్లు కోల్పోయాయి అనేది పచ్చి నిజం. మళ్లీ అలాంటి సీనే వచ్చే నెల రిపీట్ అవ్వబోతోంది. కానీ ఈసారి హీరోలు మేల్కొన్నారు. ఎలాంటి బేషజాలు, ఇగోలు పెట్టుకోదలుచుకోలేదు. కలిసి కూర్చున్నారు. చర్చించుకున్నారు. పరిష్కారాలు వాళ్లే కనుక్కున్నారు.
ఫిబ్రవరి 5న…. నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధ విడుదలకు సిద్ధమైంది. అదే రోజున సాయిశ్రీనివాస్ నటించిన స్పీడున్నోడు…. సునీల్ చేసిన కృష్ణాష్టమి సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. దీంతో ఈ ముగ్గురు హీరోలు కూర్చుని తమలో తాము చర్చించుకున్నారు. స్పీడున్నోడు సినిమాను ఫిబ్రవరి 5న…. కృష్ణగాడి వీరప్రేమగాథను ఫిబ్రవరి 12న….. ఇప్పటికే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న కృష్ణాష్టమి సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
Next Story