పవన్ సినిమాకు బీప్ మ్యూజిక్ డైరెక్టర్
బీప్ సాంగ్ వివాదంతో చిక్కుల్లో పడ్డాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఆ పాట దెబ్బకు కోర్టు కేసులు ఎదుర్కోవడమే కాకుండా…. రెండు బంగారం లాంటి అవకాశాలు కూడా కోల్పోయాడు. ధనుష్ తన కొత్త సినిమా నుంచి పీకేస్తే…. తెలుగులో అ..ఆ సినిమా నుంచి నితిన్ పీకేశాడు. ఇలా రెండు ఆఫర్లు కోల్పోయిన అనిరుధ్ కు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. త్వరలోనే పవన్ కల్యాణ్ సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం అనిరుధ్ కు దక్కనుంది. […]
BY sarvi27 Jan 2016 12:34 AM IST

X
sarvi Updated On: 27 Jan 2016 6:20 AM IST
బీప్ సాంగ్ వివాదంతో చిక్కుల్లో పడ్డాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఆ పాట దెబ్బకు కోర్టు కేసులు ఎదుర్కోవడమే కాకుండా…. రెండు బంగారం లాంటి అవకాశాలు కూడా కోల్పోయాడు. ధనుష్ తన కొత్త సినిమా నుంచి పీకేస్తే…. తెలుగులో అ..ఆ సినిమా నుంచి నితిన్ పీకేశాడు. ఇలా రెండు ఆఫర్లు కోల్పోయిన అనిరుధ్ కు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది.
త్వరలోనే పవన్ కల్యాణ్ సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం అనిరుధ్ కు దక్కనుంది. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఎస్ జే సూర్య దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడని సమాచారం. ఈ ప్రాజెక్టు కనుక సాకారం అయితే ఆ సినిమాకు కచ్చితంగా అనిరుద్ధే సంగీతం అందిస్తాడు. ఎందుకంటే… ఎస్ జే సూర్య, అనిరుధ్ మధ్య అంతటి అనుబంధం ఉంది. పవన్ సినిమా ఓకే అయితే తనకే ఛాన్స్ ఇస్తానని… అనిరుధ్ కు సూర్య మాట కూడా ఇచ్చాడట. సో…. వరుస ఎదురుదెబ్బల మధ్య ఓ గుడ్ న్యూస్ అందుకున్నాడు ఈ కుర్ర కంపోజర్.
Next Story