రేవంత్ రెడ్డి నోట "బీఫ్" మాటలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కూటమి తరపున రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్… టీఆర్‌ఎస్, ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలీబాబా 40 మంది దొంగల తరహాలో నడుస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోతే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం 520మందినే అమరులుగా గుర్తించిందని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించిన తుమ్మల, తలసానిలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఐఎంను ఉద్దేశించి రేవంత్ మరింత […]
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కూటమి తరపున రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్… టీఆర్‌ఎస్, ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలీబాబా 40 మంది దొంగల తరహాలో నడుస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోతే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం 520మందినే అమరులుగా గుర్తించిందని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించిన తుమ్మల, తలసానిలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఐఎంను ఉద్దేశించి రేవంత్ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఆవు అమ్మతో సమానమని అలాంటి గోమాతను చంపి తినే వారికి ఓట్లేలా వేస్తారని ప్రశ్నించారు. అయితే రేవంత్ ఈ వ్యాఖ్యలను ఎంఐఎంను దృష్టిలో ఉంచుకుని అన్నవే అయినప్పటికీ గోమాంసం తినడం అన్నది ఎంఐఎం నేతల వ్యక్తిగతం కాదని ఒక వర్గం వారంతా గోమాంసం తింటారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యల వల్ల వారంతా పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. రేవంత్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల ముస్లిం ఓటర్లు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదంటున్నారు. హైదరాబాద్‌లో బీఫ్ తినాలంటే ఎంఐఎంకు ఓటేయాలని సోమవారం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.
Click on Image to Read: