వీరి కుల విన్యాసాలపై ధ్వజమెత్తిన జాతీయ మీడియా
ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ మీడియా సంస్థలు చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నాయన్నది కాదనలేని నిజం. దీంతో చంద్రబాబు చేస్తున్న కొన్ని రహస్య రాజకీయాలను బయటపెట్టే మీడియా సంస్థలు తెలుగు నేలపై లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి చేస్తున్న కుల రాజకీయాలపై జాతీయ మీడియా విరుచుకుపడుతోంది. హెచ్‌సీయూ వీసీ పదవి మొదలుకొని ముఖ్యమైన జాతీయ సంస్థల్లో తన కులం వారికి చంద్రబాబు, వెంకయ్య ఏవిధంగా పదవులు కట్టబెడుతున్నది బయటపెడుతున్నాయి. చివరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆరు పద్మా అవార్డులు […]
ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ మీడియా సంస్థలు చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నాయన్నది కాదనలేని నిజం. దీంతో చంద్రబాబు చేస్తున్న కొన్ని రహస్య రాజకీయాలను బయటపెట్టే మీడియా సంస్థలు తెలుగు నేలపై లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి చేస్తున్న కుల రాజకీయాలపై జాతీయ మీడియా విరుచుకుపడుతోంది. హెచ్‌సీయూ వీసీ పదవి మొదలుకొని ముఖ్యమైన జాతీయ సంస్థల్లో తన కులం వారికి చంద్రబాబు, వెంకయ్య ఏవిధంగా పదవులు కట్టబెడుతున్నది బయటపెడుతున్నాయి. చివరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆరు పద్మా అవార్డులు పొందిన వారిలో ఏకంగా ఐదుగురు ఒకే కులం వారు ఉండడాన్ని కూడా జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇలా కమ్మ సామాజికవర్గం వారు పదవులన్నీ ఎగరేసుకుపోవడం వెనుక చంద్రబాబు, వెంకయ్య హస్తం ఉన్నట్టు మేధావులు అభిప్రాయపడుతున్నారని జాతీయ ఆంగ్ల పత్రికలు రాశాయి.
హెచ్‌సీయూలో రోహిల్ ఆత్మహత్య అంశం వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. హెచ్‌సీయూ వీసీ పదవి అప్పారావుకు దక్కడం వెనుక వెంకయ్య హస్తముందని పలువురు అభిప్రాయపుడుతున్నారని కథనం వెల్లడించింది. అప్పారావు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. ముఖ్యమైన పదవుల్లో కమ్మ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తుండడం స్పష్టంగా అర్థమవుతోందని… దీనిపై రాష్ట్రపతి కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని హరగోపాల్ అభిప్రాయపడినట్టు ఆ పత్రిక వెల్లడించింది.
కమ్మ సామాజికవర్గం వారికి పదవులు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో రేసులో ఉన్న సీనియర్ అధికారులను అణచివేస్తున్నారని కంచె ఐలయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని కూడా సదరు పత్రిక కోట్ చేసింది. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి అయిన తర్వాతే ఇలా కమ్మ కులానికి కీలక పదవులు కట్టబెట్టే తంతు మొదలైందని ఆయన మండిపడ్డారు. నేషనల్ అకాడమీ ఫర్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్, సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌తో పాటు పలు అత్యంత కీలకమైన జాతీయ సంస్థలకు అధిపతులుగా కమ్మ సామాజికవర్గం వారినే నియమించడాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా హైలైట్ చేసింది.
తాజాగా మరో జాతీయ ఆంగ్ల పత్రిక పద్మ అవార్డులపై కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆరు పద్మ అవార్డులు రాగా… వాటిలో ఐదు ఒకే సామాజికవర్గానికి దక్కడాన్ని ఎత్తిచూపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు దక్కగా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వెంకటరామారావుకు పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. నాయుడమ్మ యార్లగడ్డ, ఆళ్ల గోపాలకృష్ణ పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. పైగా వీరిలో నలుగురు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. మొత్తం మీద వెంకయ్యనాయుడు, చంద్రబాబు తీరు వల్ల ఇతర కులాల్లో అసంతృప్తి బయలుదేరే ప్రమాదం ఉందని… తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Click on Image to Read: