వైసీపీలోకి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
ఏపీ రాజకీయాలు టీడీపీ, వైసీపీ మధ్య పోలరైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో బాగా దెబ్బతిన్న తర్వాత కొందరు టీడీపీ వైపు, మరికొందరు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీలోకి మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే చేరుతున్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబులు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 27న కాకినాడలో జరగనున్న జగన్ యువభేరి సందర్భంగా వీరు వైసీపీలో చేరుతారు. ముత్తా గోపాలకృష్ణ 1983, 1994, […]
ఏపీ రాజకీయాలు టీడీపీ, వైసీపీ మధ్య పోలరైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో బాగా దెబ్బతిన్న తర్వాత కొందరు టీడీపీ వైపు, మరికొందరు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీలోకి మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే చేరుతున్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబులు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 27న కాకినాడలో జరగనున్న జగన్ యువభేరి సందర్భంగా వీరు వైసీపీలో చేరుతారు. ముత్తా గోపాలకృష్ణ 1983, 1994, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1987 నుంచి రెండేళ్ల పాటు పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు.
జర్నలిస్టుగా పనిచేసిన కన్నబాబు 2009లో పీఆర్పీలో చేరి కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిరంజీవికి సన్నిహితుడిగా కన్నబాబుకు పేరుంది. 2014 ఎన్నికల్లో కన్నబాబు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 45 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. అయితే విజయం సాధించలేకపోయారు. మాజీ మంత్రి ముత్తా, మాజీ ఎమ్మెల్యే కన్నబాబుతో పాటు పలువురు జిల్లా నేతలు జగన్ సమక్షంలో వైసీపీకి చేరనున్నారు.
click on image to read: