Telugu Global
Others

సేమ్ పించ్ " తెరపైకి కోడెల పాత కథ

ఏపీ ప్రభుత్వం మరోసారి చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు ఎంత నేరం చేసినా వెనుకేసుకొస్తున్న చంద్రబాబు… విపక్షాల నేతల విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఇప్పటికే బలంగా ఉన్నాయి. అసలేం జరిగిందో తెలుసుకోకుండానే ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను లోపలేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదేంటో గానీ వైసీపీ నేతలు ఏ తరహా కేసుల్లో అరెస్ట్ అవుతున్నారో… అంతకంటే ముందే అలాంటి నేరాన్ని బహిరంగంగా టీడీపీ పెద్దలు చేసి దర్జాగా బయటతిరుగుతున్నారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి […]

సేమ్ పించ్  తెరపైకి కోడెల పాత కథ
X

ఏపీ ప్రభుత్వం మరోసారి చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు ఎంత నేరం చేసినా వెనుకేసుకొస్తున్న చంద్రబాబు… విపక్షాల నేతల విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఇప్పటికే బలంగా ఉన్నాయి. అసలేం జరిగిందో తెలుసుకోకుండానే ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను లోపలేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అదేంటో గానీ వైసీపీ నేతలు ఏ తరహా కేసుల్లో అరెస్ట్ అవుతున్నారో… అంతకంటే ముందే అలాంటి నేరాన్ని బహిరంగంగా టీడీపీ పెద్దలు చేసి దర్జాగా బయటతిరుగుతున్నారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి చేశారంటూ కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఆయనను బయటకు వదల్లేదు. ఇక్కడే స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఉదంతం తెరపైకి వస్తోంది.

కోడెల శివప్రసాద్‌రావు 2014 నవంబర్‌6న హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంతో వెళ్తూ సృష్టించిన అలజడిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో కోడెల శివప్రసాదరావు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. ఎయిర్‌హోస్టెస్‌ను విమానంలో అందరూ చూస్తుండగానే బూతులు తిట్టారు. అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. విమానం దిగాక నీ కథ తేలుస్తా అంటూ హెచ్చరించారు. ఫుడ్ ట్రేను ఆమె వైపు విసిరారు.

సదరు ఎయిర్ హోస్టెస్ చేసిన నేరం ఏమీ లేదు. స్పీకర్‌ శివప్రసాద్ ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణిస్తుండగా ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ ఒకరు వచ్చి ఆయన పక్క సీట్లో కూర్చుని చిట్‌చాట్ మొదలుపెట్టారు. అయితే కాసేపటి తర్వాత ”మీ సీట్లోకి మీరు వెళ్లండి” అని ఐఏఎస్‌ అధికారిని మహిళా సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన కోడెల ఆమెపై బూతుల దండకం ఎత్తుకున్నారు. ఆ సమయంలో విమానం 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అనంతరం కోడెల తీరుపై బాధితురాలు పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదు గురించి ఇప్పటి వరకు పట్టించుకున్న నాథుడే లేరు. ఈ విషయంపై అప్పట్లో చంద్రబాబును విలేకర్లు ప్రశ్నించగా సమాచారం లేదంటూ సమాధానం దాటవేసి వెళ్లిపోయారు.

కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు టీడీపీ వారే కావడంతో కోడెలపై కేసు విషయంలో డీజీసీఏ, పోలీసులు కళ్లు మూసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు . ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఎయిర్‌పోర్టులో జరిగిన నేరం కంటే విమానం గాల్లో ఉన్న సమయంలో జరిగే నేరాన్ని డీజీసీఏ వంద రెట్లు తీవ్రమైనదిగా పరిగణిస్తుంది. అయితే ఎయిర్‌పోర్టులో జరిగిన వివాదం విషయంలో ఆఘమేఘాల మీద మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు… విమానం గాల్లో ఉండగా ఓ మహిళా సిబ్బందిని బూతులు తిట్టి, అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చిన కోడెల శివప్రసాద్ విషయంలో మాత్రం నోరు విప్పకపోవడం చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఏపీలో అధికార పార్టీకి, ప్రతిపక్షానికి వేర్వేరు చట్టాలు అమలులో ఉన్నట్టుగా ఉంది.

Click on Image to Read:

vangaveeti-radha

jayasudha

lokesh

balakrishna1

jagan-lokesh

First Published:  25 Jan 2016 6:47 AM IST
Next Story