నాగార్జున సినిమాలో జగపతిబాబు
విలన్ గా ఇప్పటికే సూపర్ క్లిక్కయిపోయాడు జగపతిబాబు. లెజెండ్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. మరోవైపు శ్రీమంతుడు సినిమాలో చేసినట్టు…. క్యారెక్టర్ రోల్స్ లో కూడా తనకుతానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పుడీ సీనియర్ హీరో… మరో సీనియర్ హీరోతో సమరానికి సై అంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగార్జున తదుపరి చిత్రంలో జగపతిబాబు విలన్ గా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమాను నిర్మించాలనుకున్నాడు నిర్మాత […]
BY sarvi25 Jan 2016 12:42 AM IST

X
sarvi Updated On: 25 Jan 2016 5:36 PM IST
విలన్ గా ఇప్పటికే సూపర్ క్లిక్కయిపోయాడు జగపతిబాబు. లెజెండ్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. మరోవైపు శ్రీమంతుడు సినిమాలో చేసినట్టు…. క్యారెక్టర్ రోల్స్ లో కూడా తనకుతానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పుడీ సీనియర్ హీరో… మరో సీనియర్ హీరోతో సమరానికి సై అంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగార్జున తదుపరి చిత్రంలో జగపతిబాబు విలన్ గా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమాను నిర్మించాలనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి మాస్ రాజా తప్పుకున్నాడనే విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ కథను నాగార్జున చేసే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలో నెగెటివ్ పాత్రకు జగపతిబాబును సంప్రదించినట్టు తెలుస్తోంది. నాగార్జున హీరో అనగానే జగపతి బాబు విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడట. మరి ఈసారైనా ఈ ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కుతుందేమో చూడాలి.
Next Story