సునీతమ్మ, అచ్చెన్నపై చంద్రబాబు ఆగ్రహం
విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ వాడీవేడిగా సాగింది. మంత్రులపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి చంద్రన్న కానుక విషయంలో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రన్న కానుక అభాసుపాలైందని మండిపడ్డారు. కానుకల పంపిణీలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. మంచి ఉద్దేశంలో పేదలకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు కోట్లు ఖర్చు పెడితే తీరా చెడ్డ పేరు తీసుకొచ్చారని పరిటాల సునీత నిర్వహిస్తున్న శాఖ తీరును తప్పుపట్టారు. నాసిరకం సరుకులు ఎందుకు పంపిణీ […]
విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ వాడీవేడిగా సాగింది. మంత్రులపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి చంద్రన్న కానుక విషయంలో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రన్న కానుక అభాసుపాలైందని మండిపడ్డారు. కానుకల పంపిణీలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. మంచి ఉద్దేశంలో పేదలకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు కోట్లు ఖర్చు పెడితే తీరా చెడ్డ పేరు తీసుకొచ్చారని పరిటాల సునీత నిర్వహిస్తున్న శాఖ తీరును తప్పుపట్టారు. నాసిరకం సరుకులు ఎందుకు పంపిణీ చేశారని మండిపడ్డారు.
మంత్రి అచ్చెన్నాయుడిపైనా తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు. ఇతర శాఖలపై అచ్చెన్న ఫిర్యాదు చేయడంతో సీఎం అభ్యంతరం చెప్పారు. పక్క శాఖలపై ఫిర్యాదు చేయడం మానుకుని ముందు నీ శాఖను సక్రమంగా నిర్వహించూ అంటూ హితవు పలికారు. దీంతో అచ్చెన్న సైలెంట్ అయిపోయారు. రాజధాని ప్రాంత మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావులను కేబినెట్ భేటీలో చంద్రబాబు నిలదీశారు. రాజధాని ప్రాంత రైతులు తిరగబడే పరిస్థితి వచ్చిందని… ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని ఉమ, పుల్లారావును నిలదీశారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించడం లేదని ఇద్దరు మంత్రులను చంద్రబాబు ప్రశ్నించారు. మొత్తం మీద చంద్రబాబు ఈసారి మంత్రులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
click on image to read: