గ్రేటర్ ప్రచారంలో ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు పార్టీలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారు. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినాలనుకుంటే ఎంఐఎంకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం ఓడిపోతే గ్రేటర్‌లో బీఫ్ కూడా తినే అవకాశం ఉండదన్నారు. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ కూటమి గెలిస్తే బీఫ్‌ను మరచిపోవాల్సిందేనన్నారు. బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి వచ్చాక ముంబైలో వారం పాటు బీఫ్‌ను నిషేధించారని… హైదరాబాద్ మరో ముంబైలా కాకుండా […]
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు పార్టీలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారు. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినాలనుకుంటే ఎంఐఎంకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం ఓడిపోతే గ్రేటర్‌లో బీఫ్ కూడా తినే అవకాశం ఉండదన్నారు. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ కూటమి గెలిస్తే బీఫ్‌ను మరచిపోవాల్సిందేనన్నారు. బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి వచ్చాక ముంబైలో వారం పాటు బీఫ్‌ను నిషేధించారని… హైదరాబాద్ మరో ముంబైలా కాకుండా అడ్డుకునేందుకు ఎంఐఎంకు ఓటేయాలని ఓవైసీ పిలుపునిచ్చారు. ఓటర్ల ఆకట్టుకునేందుకు ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.