నాకు ప్రపంచం గురించి తెలిసింది: చంద్రబాబు
దావోస్ పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు. పర్యటన వల్ల ఎన్నో విషయాలు తెలిశాయన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే వెసులుబాటు దావోస్ పర్యటన వలన తనకు కలిగిందన్నారు. పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంతో నూతన పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జురిక్ లో 11 దేశాల ప్రతినిధులను కలిసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఆలోచన ప్రజల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారిందన్నారు. రాష్ట్రంలో ఎండ ఎప్పుడూ ఉంటుందని […]
దావోస్ పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు. పర్యటన వల్ల ఎన్నో విషయాలు తెలిశాయన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే వెసులుబాటు దావోస్ పర్యటన వలన తనకు కలిగిందన్నారు. పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంతో నూతన పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జురిక్ లో 11 దేశాల ప్రతినిధులను కలిసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఆలోచన ప్రజల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారిందన్నారు. రాష్ట్రంలో ఎండ ఎప్పుడూ ఉంటుందని కాబట్టి సోలార్ విద్యుత్ పెరిగితే కరెంట్ కష్టాలు తీరిపోతాయన్నారు. విద్యుత్ చార్జీతో నడిచే వాహనాలను ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.