Telugu Global
Others

గ్రేటర్‌లో ఏపీ సైన్యాన్ని దింపుతున్న చంద్రబాబు

గ్రేటర్‌ ఎన్నికలు సమీపిస్తున్నవేళ టీడీపీ తన ఎత్తులకు పదునుపెడుతోంది. గ్రేటర్‌లో సీమాంధ్ర ఓటర్లు ఉండడంతో కేవలం టీటీడీపీ నేతలతో పని కాదన్న నిర్దారణకు వచ్చిన చంద్రబాబు ఏపీ నుంచి బలగాన్ని దింపుతున్నారు. గ్రేటర్‌లో కింగ్ మేకర్ టీడీపీయేనని ప్రకటించిన లోకేష్‌ ఏ నేత ఎక్కడ ప్రచారం చేయాలన్న దానిపై ప్లాన్ చేస్తున్నారు. ఏపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గ్రేటర్‌ పరిధిలో ప్రచారం చేయనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్‌లో ప్రచార బాధ్యతలను […]

గ్రేటర్‌లో ఏపీ సైన్యాన్ని దింపుతున్న చంద్రబాబు
X

గ్రేటర్‌ ఎన్నికలు సమీపిస్తున్నవేళ టీడీపీ తన ఎత్తులకు పదునుపెడుతోంది. గ్రేటర్‌లో సీమాంధ్ర ఓటర్లు ఉండడంతో కేవలం టీటీడీపీ నేతలతో పని కాదన్న నిర్దారణకు వచ్చిన చంద్రబాబు ఏపీ నుంచి బలగాన్ని దింపుతున్నారు. గ్రేటర్‌లో కింగ్ మేకర్ టీడీపీయేనని ప్రకటించిన లోకేష్‌ ఏ నేత ఎక్కడ ప్రచారం చేయాలన్న దానిపై ప్లాన్ చేస్తున్నారు. ఏపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గ్రేటర్‌ పరిధిలో ప్రచారం చేయనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్‌లో ప్రచార బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు లోకేష్ వివరించారు. గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ తన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను మోహరించిందని అందుకు ధీటుగా మనం కూడా రంగంలోకి దిగాలని లోకేష్ ఆదేశించారు.

ఒక్కో ప్రజాప్రతినిధికి ఒక్కో డివిజన్ కేటాయిస్తామని… ఆ పరిధిలోనే సీరియస్‌గా పనిచేయాలని లోకేష్ వెల్లడించారు. ఏపీ మంత్రులకు డివిజన్ కాకుండా ఒక్కో నియోజకవర్గం అప్పగించాలని కొందరు సూచించినా లోకేష్ మాత్రం అంగీకరించలేదు. నియోజకవర్గం మొత్తం అప్పగిస్తే పట్టుదొరకదని… ఇది చంద్రబాబు ఆదేశమని నేతలతో చెప్పారు లోకేష్. 2009 గ్రేటర్ ఎన్నికల్లోనూ ఏపీ టీడీపీ నేతలు గ్రేటర్‌లో పనిచేశారు… అప్పుడు ఎవరు ఏ ప్రాంతంలో పనిచేశారో ఈసారి కూడా వారికే బాధ్యతలు అప్పగించనున్నారు. లోకేష్ వ్యూహం ఎంతవరకు పని చేస్తుందో ఫిబ్రవరి 5న తేలిపోతుంది.

First Published:  24 Jan 2016 11:42 AM IST
Next Story