మంత్రిగారి "మోకాలి"లో ఇంత కథ ఉందా?
ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చిక్కుల్లో పడ్డారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మంత్రి కీళ్ల మార్పిడికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని ఆదర్శవంతుడయ్యాడని ప్రచారం కూడా సాగింది. అయితే అసలు కథ వేరే ఉందని తేలింది. కేవలం పబ్లిసిటీ కోసమే మంత్రి ఇలా చేశారని బయటపడింది. మంత్రిగారి ఆపరేషన్ కోసం ప్రత్యేక బెడ్‌ను అప్పడికప్పుడు కొనుగోలు చేశారు. అంతవరకు ఓకే. కానీ మంత్రికి ఆపరేషన్ చేసిన వైద్యులు కూడా జీజీహెచ్ వాళ్లు కాదు. […]
ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చిక్కుల్లో పడ్డారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మంత్రి కీళ్ల మార్పిడికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని ఆదర్శవంతుడయ్యాడని ప్రచారం కూడా సాగింది. అయితే అసలు కథ వేరే ఉందని తేలింది. కేవలం పబ్లిసిటీ కోసమే మంత్రి ఇలా చేశారని బయటపడింది.
మంత్రిగారి ఆపరేషన్ కోసం ప్రత్యేక బెడ్‌ను అప్పడికప్పుడు కొనుగోలు చేశారు. అంతవరకు ఓకే. కానీ మంత్రికి ఆపరేషన్ చేసిన వైద్యులు కూడా జీజీహెచ్ వాళ్లు కాదు. కార్పొరేట్ వైద్యులు. ఈ ఆపరేషన్‌ను కేర్ ఆస్పత్రి వైద్యుడు బీఎన్ ప్రసాద్, గుంటూరు సాయిభాస్కర్ ఆసుపత్రి వైద్యుడు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి నిర్వహించారు. కథ అంతటితో అయిపోలేదు. . మంత్రిగారి ఆపరేషన్‌కు వాడిన పరికరాలు కూడా జీజీహెచ్‌కు చెందినవి కావు. కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వాటిని తీసుకొచ్చారు. మంత్రిగారి ఆపరేషన్ అయిపోగానే సైలెంట్‌గా వాటిని తరలించివేశారు.
జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి చికిత్స చేయించుకున్నానని మంత్రిగారు చెబుతున్నారు. కానీ ఇక్కడ సామాన్యులకు ఇలాంటి చికిత్సలు చేయడం మానేసి 14 ఏళ్లు అవుతోంది. సరే ఇప్పుడైనా చేస్తున్నారా అంటే అదేమీ లేదు. అసలు కీళ్ల మార్పిడి చికిత్సకు అవసరమైన పరికరాలే తమ వద్ద లేవని వైద్యులు చెబుతున్నారు. కానీ మంత్రిగారు తలుచుకున్నారు కాబట్టి అప్పటికప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి పరికరాలు, వైద్యులను రప్పించి మోకాలికి వైద్యం చేశారు. అది మంత్రిగారి మోకాలికి, సామాన్యుడికి మోకాలికి ఉన్న తేడా. ఒక రకంగా వైద్యానికి జీజీహెచ్ ఆస్పత్రే కాదు… అక్క్డడి వైద్యులు కూడా పనికి రారని మంత్రి ఇన్‌డైరెక్ట్‌గా సర్టిఫికేట్ ఇచ్చేశారని ఆస్పత్రి సిబ్బంది విమర్శిస్తున్నారు. అదన్న మాట జీజీహెచ్‌తో పాటు తన పేరును ఎక్కడికో తీసుకెళ్దామనుకున్న మంత్రిగారి మోకాలి ఆపరేషన్ అసలు కథ.
Click on Image to Read: