ముగ్గురు కోతులకు పక్షవాతం వచ్చిందా?
ఎదుటివారిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం నారాయణ స్టైల్. ఇప్పుడు మరోసారి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌లు ముగ్గురు కోతులని అభివర్ణించారు. అందుకే వీరికి చెడు కనిపించదు, చెడు వినిపించదని ఎద్దేవా చేశారు. హెచ్‌సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నారాయణ సంఘీభావం తెలిపారు. రోహిత్ చనిపోతే చంద్రబాబు, కేసీఆర్‌లు యూనివర్శిటీకి ఎందుకు రాలేదని నారాయణ ప్రశ్నించారు. వారికేమైనా పక్షవాతం వచ్చిందా?. నోరు పడిపోయిందా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ […]

ఎదుటివారిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం నారాయణ స్టైల్. ఇప్పుడు మరోసారి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌లు ముగ్గురు కోతులని అభివర్ణించారు. అందుకే వీరికి చెడు కనిపించదు, చెడు వినిపించదని ఎద్దేవా చేశారు. హెచ్‌సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నారాయణ సంఘీభావం తెలిపారు. రోహిత్ చనిపోతే చంద్రబాబు, కేసీఆర్‌లు యూనివర్శిటీకి ఎందుకు రాలేదని నారాయణ ప్రశ్నించారు. వారికేమైనా పక్షవాతం వచ్చిందా?. నోరు పడిపోయిందా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ఆంధ్రావాడు కాబట్టే కేసీఆర్ రాలేదంటూ మరో కామెంట్ కూడా చేశారు. రోహిత్ ఘటనపై విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రులు, వీసీ పదవుల్లో ఉండడానికి వీల్లేదన్నారు నారాయణ.